నవజాత శిశువుల్లో చర్మ వ్యాధులా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

సాధారణంగా మన చర్మంతో పోలిస్తే పిల్లల చర్మం వేరుగా ఉంటుంది. నవజాత శిశువుల చర్మం తక్కువ లిపిడ్లు ఉండి ఎక్కువ ఆమ్లాలు ఉండటం వల్ల ఎంతో మృదువుగా ఉంటుంది. అయితే చర్మం మృదువుగా ఉండటం వల్ల పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువగా చర్మవ్యాధుల బారిన పడుతుంటారు. దద్దుర్లు, శిశు మొటిమలు, వేడి దద్దుర్లు, తామర లాంటి ఆరోగ్య సమస్యలు నవజాత శిశువులను ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. Also Read: బట్టతలతో బాధ పడుతున్నారా.. అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన […]

Written By: Navya, Updated On : February 15, 2021 11:46 am
Follow us on

సాధారణంగా మన చర్మంతో పోలిస్తే పిల్లల చర్మం వేరుగా ఉంటుంది. నవజాత శిశువుల చర్మం తక్కువ లిపిడ్లు ఉండి ఎక్కువ ఆమ్లాలు ఉండటం వల్ల ఎంతో మృదువుగా ఉంటుంది. అయితే చర్మం మృదువుగా ఉండటం వల్ల పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువగా చర్మవ్యాధుల బారిన పడుతుంటారు. దద్దుర్లు, శిశు మొటిమలు, వేడి దద్దుర్లు, తామర లాంటి ఆరోగ్య సమస్యలు నవజాత శిశువులను ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి.

Also Read: బట్టతలతో బాధ పడుతున్నారా.. అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..?

పిల్లల్లో చర్మవ్యాధులు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సున్నితమైన దుస్తుల ను మాత్రమే ధరింపజేయాలి. చర్మం యొక్క మడతలను క్రమంగా శుభ్రం చేయడంతో పాటు చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు చర్మ గ్రంథులు మూసుకుపోయే లోషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు.

Also Read: మునగకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేడి దద్దుర్లు సోకితే ఏర్పడే ఎర్రటి గడ్డలు తొలగిపోతాయి. పిల్లలకు చెమట పీల్చుకునే దుస్తులను ధరింపజేయాలి. శిశువు తలపై జిడ్డైన మరియు పొలుసుల పాచెస్ పేరుకుపోతే శిశువు జుట్టును షాంపూతో శుభ్రం చేయడంతో పాటు మృదువైన బ్రష్ సాయంతో తలను దువ్వాలి. శిశువు తలను సున్నితంగా మర్ధనా చేయాలి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

శిశువుకు మొటిమలు వస్తే రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పెద్దలు మొటిమలకు చికిత్స కొరకు ఉపయోగించే క్రీములను పిల్లల కోసం వినియోగించకూడదు. పిల్లలకు అలెర్జీ కలిగించే ఆహారాన్ని పెట్టకూడదు. శిశువు గోర్లలో సూక్ష్మక్రిములు చేరకుండా గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఎక్కువ వేడి తగిలే ప్రదేశాలకు పిల్లలను దూరంగా ఉంచితే మంచిది.