Chandrababu And Pawan Kalyan- AP Ministers: నిజం చెప్పులేసుకొని బయలుదేరే ముందే.. అబద్ధం ఊరంతా వెళ్లి చాటింపు చేసినట్టుంది ఏపీలో వైసీపీ నేతల పరిస్థితి. చంద్రబాబు, పవన్ ల భేటీ కాక ముందే ట్విట్లు పెట్టి, విమర్శలతో నానా యాగీ చేశారు. తెలుగు ప్రజలకు ఎంటర్ టైన్మంట్ పంచారు. అధినేత జగన్ కళ్లలో పడాలన్న ఆరాటమో తెలియదు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ తో రక్తికట్టించారు. అసలు పవన్ చంద్రబాబు ఇంటికి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఇరు పార్టీలకు సైతం సమాచారం లేదు. చంద్రబాబును కలవడానికి పవన్ వెళుతున్నారని నిమిషాల ముందే మీడియాకు సమాచారం వచ్చింది. కొద్దిసేపట్లోనే భేటీ జరిగిపోయింది. అయితే దీనిపై ముందస్తు సమాచారం లేకపోవడంతో వైసీపీ నేతలుకూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే మీడియాలో ఇద్దరి భేటీ ఉందని తెలియడంతో వారి రియాక్షన్ మామ్మూలుగా లేదు. వీర లెవల్ లో విరుచుకుపడ్డారు. ఎక్కడైనా విపక్ష నేతలు కలిసిన తరువాత.. వారు మీడియాతో మాట్లాడిన తరువాత.. రాజకీయ ప్రతికూలాంశాలు ఉంటే స్పందిస్తారు. అయితే తమకంటే రాజకీయ తోపులెవరు లేరు అనుకునే వైసీపీ నేతల స్టైలే వేరు కదా.. సోషల్ మీడియాలో కొందరు, నేరుగా మీడియాతో మాట్లాడుతూ మరికొందరు తెగ హంగామా చేశారు. కొందరైతే వ్యక్తిగత, బూతు మాటలతో రెచ్చిపోయార
Chandrababu And Pawan Kalyan- AP Ministers
సంక్రాంతికి అందరిళ్లకు గంగిరెద్దులు వెళతాయని.. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. డూడూ బసవన్నలా తలూపేందుకే వెళ్లారంటూ ట్విట్ చేశారు. నేరుగా మీడియాకే ఫోన్ ఇన్ లు ఇచ్చిన వారూ ఉన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పవన్ వెళ్లారని.. మామ్మూళ్లు, ప్యాకేజీలంటూ నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేశారు. అయితే వారి మాటల్లో మాత్రం అధినేత జగన్ ను మెప్పించేందుకేనని స్పష్టంగా అర్ధమైంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఒక అడుగు ముందుకేసి పండుగ మామ్మూళ్లు కోసం దత్త దండ్రి దగ్గరకు దత్త కుమారుడు వెళ్లాడంటూ ట్విట్ చేశారు.
ఇంకా పవన్ చంద్రబాబు ఇంట్లో అడుగుపెట్టక ముందే ట్విట్ల దండయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం వరకూ అది కొనసాగింది. మంత్రి జోగి రమేష్ అయితే ప్యాకేజీ మాట్లాడుకునేందుకు, తెచ్చుకునేందుకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రంలో కూర్చొని ఏపీలో జీవో 1 గురించి చర్చించడమేమిటని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వీరి కలయికతో ఏపీకి ఒరిగిందేమిటని కూడా నిలదీశారు. ఎంపీ మార్గాని భరత్ కూడా ట్విట్లు చేశారు. అయితే అందరి ట్విట్లు ఒకే మాదిరిగా ఉన్నాయి. అనుకొని పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే పవన్ అనుకోకుండా వెళ్లడంతో ఐ ప్యాక్ టీమ్ అప్పటికప్పుడు ట్విట్లను రూపొందించడంలో కాస్తా కంగారు పడినట్టుందని సటైర్లు వినిపిస్తున్నాయి.
Chandrababu And Pawan Kalyan
వారిద్దరు విపక్ష నేతలు. వారు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటి అని ఇప్పుడు ఏపీ నాట వినిపిస్తోంది. వారిద్దరూ కలవకముందే వైసీపీ నేతల్లో అలజడి చూస్తుంటే వారిలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భయం మాటున వారిలో నిరాశ, నిస్పృహలు బయటపడుతున్నాయి. అందుకే వారు వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పొద్దస్తమానం పవన్ పై మంత్రులు ఏడుస్తుంటారు. పెబబొబ్బులు పెడుతుంటారు. అటువంటిది చంద్రబాబుతో భేటీ అయిన తరువాత ఎందుకు ఊరుకుంటారు. తమ నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడతారు. పవన్ ను తిట్టడం ద్వారా అధినేత దృష్టిలో పడాలని తెగ ఆరాటపడతారు.