https://oktelugu.com/

ఏపీ మీడియా మైండ్‌గేమ్‌.. టీడీపీని గల్లంతు చేసేందుకేనా..?

ఎన్నికలు అంటేనే అటు పార్టీలకు.. ఇటు మీడియాకు ఫుల్‌ జోష్‌. ఎన్నికలు వచ్చాయంటే చాలా మీడియాకు హాట్‌హాట్‌ న్యూస్‌లు దొరుకుతుంటాయి. ఇప్పుడు ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి.. తెలంగాణలో నాగార్జున సాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి బై పోల్‌ జరగబోతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వార్తా ఛాన్సెల్స్‌ అన్నీ తిరుపతి, సాగర్‌‌ ఉప ఎన్నికల పుణ్యమా అని బాగా యాక్టివ్ అయిపోయాయి. అయితే.. ఏపీలో మాత్రం కొన్ని ప్రధాన ఛానల్స్‌లో టీడీపీని పూర్తిగా సైడ్ చేసి- తిరుపతిలో పోటీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 31, 2021 / 12:04 PM IST
    Follow us on


    ఎన్నికలు అంటేనే అటు పార్టీలకు.. ఇటు మీడియాకు ఫుల్‌ జోష్‌. ఎన్నికలు వచ్చాయంటే చాలా మీడియాకు హాట్‌హాట్‌ న్యూస్‌లు దొరుకుతుంటాయి. ఇప్పుడు ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి.. తెలంగాణలో నాగార్జున సాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి బై పోల్‌ జరగబోతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వార్తా ఛాన్సెల్స్‌ అన్నీ తిరుపతి, సాగర్‌‌ ఉప ఎన్నికల పుణ్యమా అని బాగా యాక్టివ్ అయిపోయాయి. అయితే.. ఏపీలో మాత్రం కొన్ని ప్రధాన ఛానల్స్‌లో టీడీపీని పూర్తిగా సైడ్ చేసి- తిరుపతిలో పోటీ అంతా వైఎస్సార్సీపీ, బీజేపీల మధ్య పోటీ ఉన్నట్టు చూపించే మైండ్ గేమ్ నడుస్తుందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేపీకి మధ్య లోపాయికారిగా కాస్త అవగాహన ఉందనే అభిప్రాయం ప్రజల్లో మొదటి నుంచీ ఉంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ చంద్రబాబుని విమర్శించాడే తప్పించి ఏ నాడూ మోడీని పల్లెత్తు మాట అనలేదు. పైగా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన తరువాత వైఎసీపీ, బీజేపీల మధ్య బంధం మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇక రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కూడా -ఓ ఆరోపణ ఉంది. వారు అధికార వైసీపీకి దగ్గరగా ఉంటారు అన్న విమర్శ వినిపిస్తోంది.

    ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నిక జరగబోతోంది. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు న్యూస్ ఛానల్స్ వేదికగా ఒక రేంజ్‌లో తమ వాణిని వినిపిస్తున్నారు. అయితే.. మూడు నాలుగు రోజులుగా వార్తా చానల్స్ ఫాలో అవుతున్న వారికి, తిరుపతి ఉప ఎన్నిక కేవలం వైసీపీ, బీజేపీల మధ్య మాత్రమే ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఓ ప్రధాన చానల్‌లో వైసీపీ ప్రచార గీతానికి, బీజేపీ ప్రచార గీతానికి మధ్య ఉన్న పోలికను హైలెట్ చేస్తూ, రెండు పార్టీల వారు ఒకే జానపద గీతాన్ని కాపీ కొట్టారు అన్న అంశాన్ని ప్రస్తావించింది. ఏ పార్టీ వారు ఏ పార్టీ పాటని కాపీ కొట్టారనే అంశంపై చిన్న బులెటిన్ పెట్టింది.

    ఇవే కాకుండా వీలైనంత వరకు బులిటెన్లు అన్నీ కూడా వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అన్నట్లుగా చూపించేలా ప్రోగ్రాం డిజైనింగ్ చేసినట్లు సునిశితంగా పరిశీలించే ప్రేక్షకులకు అర్థం అవుతోంది. విజయ సాయి రెడ్డికి, సోము వీర్రాజుకి మధ్య జరిగే ట్విట్టర్ యుద్ధానికి చానల్స్ బోలెడంత ప్రచారాన్ని కల్పించడం కూడా ఇదే కోవలోకి వస్తుందని అర్థం అవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజేతగా నిలువగా రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి నిలిస్తే, బీజేపీ–జనసేన అభ్యర్థులు ఇద్దరు కలిసి కూడా 10 శాతం ఓట్లు సాధించలేక పోయారు. అయితే.. ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీని మూడో స్థానానికి పరిమితం చేయడానికి రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీ కలిపి కుట్ర పన్నాయనే అభిప్రాయం ప్రస్తుతం టీడీపీ అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. మరి మీడియా సాక్షిగా జరుగుతున్న ఈ మైండ్ గేమ్ టీడీపీని మూడో స్థానానికి పరిమితం చేయడంలో సఫలీకృతం అవుతుందా, లేక దశాబ్దాలుగా తమ వెన్నంటి ఉన్న క్యాడర్ సహాయంతో టీడీపీ తన పట్టు నిలబెట్టుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్