రేపే ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ లో రేపు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీయట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇంటర్ సప్లమెంటరీ, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాతే వీటికి సంబంధించిన తేదిలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యాపకులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 1:46 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో రేపు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీయట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇంటర్ సప్లమెంటరీ, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాతే వీటికి సంబంధించిన తేదిలను ప్రకటించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యాపకులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష పేపర్లను మూల్యంకనం చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే సమయానికల్లా ఇంటర్మీయట్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఇంటర్మీయట్ విద్యార్థులకు కొంతమేర ఊరట కలిగింది. అయితే లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో నిర్వహించిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందులో పదో తరగతి పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉన్నప్పటికీ లాక్డౌన్ ఎత్తివేయడంతో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీలోనూ పరీక్షలు వాయిదా పడుతాయని అనుకున్నారు. తెలంగాణలో బాటలోనే పలు రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండటం గమనార్హం. రెండు పేపర్లు ఉన్న సబెక్టులను ఒక్కటికి కుదించి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఇటీవల పదో విద్యార్థులకు క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే.