https://oktelugu.com/

బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టు 28 ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ న్యాయం కోసం రైతులు నాడు రోడ్డెక్కారు. బషీర్ బాగ్ లో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి అణిచివేసేందుకు నాటి సర్కార్ వారిపై కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ముగ్గురు రైతులు అమరులుకాగా.. మరేందరో పోలీసుల లాఠీదెబ్బలు తిని ఆస్పత్రులపాలయ్యారు. ఇది నాటి బాబు పాలనకు మాయని మచ్చగా నిలిచిపోయింది. Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 01:06 PM IST
    Follow us on


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టు 28 ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ న్యాయం కోసం రైతులు నాడు రోడ్డెక్కారు. బషీర్ బాగ్ లో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి అణిచివేసేందుకు నాటి సర్కార్ వారిపై కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ముగ్గురు రైతులు అమరులుకాగా.. మరేందరో పోలీసుల లాఠీదెబ్బలు తిని ఆస్పత్రులపాలయ్యారు. ఇది నాటి బాబు పాలనకు మాయని మచ్చగా నిలిచిపోయింది.

    Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

    2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీలు చేపట్టిన ఉద్యమంలో తీవ్రరూపం దాల్చింది. ఈ ఉద్యమానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆగస్టు 28నాటికి బషీర్ బాగ్ చేరుకున్న రైతులు అసెంబ్లీని ముట్టడించేందుకు అటువైపు మరలడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు ముందుకు రాకుండా కాల్పులు జరిపడంతో ముగ్గురు బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలు మృతిచెందారు.

    దీనిని నిరసిస్తూ నాటి డిప్యూటి స్పీకర్ గా ఉన్న కేసీఆర్ అప్పటి సీఎం చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఎండగడుతూ ఉద్యమకారులకు మద్దతు తెలుపుతూ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు.

    Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

    ఈ సంఘటన జరిగి 20ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికి చంద్రబాబు పాలనకు మాయని మచ్చగా మిగిలిపోయింది. చంద్రబాబుకు రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా బషీర్ బాగ్ సంఘటన నిలిచిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాబు అనాలోచిత విధానాలకు ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కాలంలో బషీర్ బాగ్ వద్ద అమరుల కోసం స్థూపం నిర్మించారు. ఇది నాటి చేదు జ్ఞాపకానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు ఆపలేవని మరోసారి బషీర్ బాగ్ సంఘటన నిరూపించింది.