AP High Court- Amaravati: ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సిట్యువేషన్ క్రిటికల్ గా ఉంది. అమరావతి వర్సెస్ మూడు రాజధానులపై పొలిటికల్ మ్యాచ్ హోరోహోరీగా సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజా మద్దతు ఉండగా.. వైసీపీ మూడు రాజధానుల పోరాటానికి అధికారం దాసోహమవుతోంది. ఒకరిది స్వచ్ఛంద పోరాటం..మరొకరిది కృత్రిమ ఉద్యమం. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉంది. అయితే ప్రజా మద్దతుతో అమరావతి రైతులు తమ పాదయాత్రను దిగ్విజయంగా సాగిస్తున్నారు. కానీ దారిపొడవునా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముళ్లు, రాళ్లూ రప్పలు, నీళ్ల సీసాలు దాడులు, అల్లరిమూకల దుర్భాషలను తట్టుకొని ముందుకు సాగుతున్నారు. అయితే తాము తలపెట్టిన మహా ఉద్యమం.. చివరి గమ్యానికి చేరుకునే సమయానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్న అమరావతి రైతులు శరణం మహా ప్రభో అంటూ మరోసారి న్యాయస్థానం తలుపు తట్టారు. సహజంగానే దీనిపై కోర్టు సీరియస్ అవుతుంది. సీరియస్ అయ్యింది కూడా.

వాస్తవానికి అమరావతి టూ తిరుపతి మహా పాదయాత్ర నిర్వహించినప్పుడే స్టేట్ లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. అమరావతికి మద్దతు పెరిగింది. అందుకే అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర 2ను శాంతిభద్రతలను సాకుగా చూపి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అమరావతి రైతులకు కోర్టు అండగా నిలిచింది. పాదయాత్రకు రక్షణ కల్పించాలని తిరిగి పోలీసులనే ఆదేశించింది. దాదాపు 40 రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా అమరావతి రైతులు పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. కానీ రైతులు దారిపొడవునా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమరావతి రాజధానికి మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. సహజంగానే ఇది వైసీపీ సర్కారుకు మింగుడుపడని అంశం. అందుకే పాదయాత్ర గమ్యానికి చేరుకుంటున్న కొలదీ తన కుట్ర రాజకీయాలకు తెరలేపింది. దానికి అధికారం తోడైంది. దారిపొడవునా నల్లబెలూన్లు, నీరు సీసాలు, రాళ్లతో అమరావతి రైతులకు స్వాగత దాడులకు దిగే వికృత చేష్టలకు దిగుతోంది. అటు కోర్టు ఆదేశాలను అమలుచేయలేక.. అధికారానికి సాగిలాలు పడి పోలీస్ శాఖ కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.
ప్రస్తుతం అమరావతి రైతు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. కొద్దిరోజుల్లో కీలకమైన విశాఖలో అడుగు పెట్టనుంది. విశాఖ క్యాపిటల్ రాజధాని వద్దంటూ చేపడుతున్న అమరావతి రైతులు సాగరనగరంలో అడుగుపెట్టే హక్కు లేదని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అల్టిమేటం ఇస్తున్నారు. స్థానికత్వాన్ని తెరపైకి తెచ్చి అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో స్థానికులు లేకపోయినా వారి ముసుగులో అధికార పార్టీ ఇబ్బందులు తప్పవని భావిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ముందుగానే మెల్కొంది. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానిపై శుక్రవారం కోర్టు కీలక ఆదేశాలు వెలువరించే అవకాశముంది. అంతకు ముందు పాదయాత్రకు ఎదురవుతున్న అనుభవాలను పిటీషనర్ల తరుపు న్యాయవాది కోర్టు ముందుంచారు. దీనిపై సీరియస్ అయిన కోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు వెలువరించే అవకాశమైతే ఉంది.

అయితే ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అమరావతి విషయంలో ఆది నుంచి కోర్టు ఆదేశాలు బేఖారవుతూ వస్తున్నాయి. దీంతో దీనిపై సీరియస్ ఆదేశాలు వెలువడే అవకాశముంది. రాజధాని రైతుల పాదయాత్రకు ఎటువంటి హాని తలపెట్టినా అందుకు జగన్ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న హెచ్చరికలను, ఆదేశాలను కోర్టు ఇచ్చినా సంశయం చెందాల్సిన పనిలేని న్యాయ కోవిదులు చెబుతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జగన్ సర్కారుకు చుక్కలు చూపించే ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. తనకు ఇష్టంలేని అమరావతి రైతుల పాదయాత్రకు తానే స్ట్రాంగ్ గా రక్షణ కల్పించాల్సిన అనివార్య పరిస్థితిని జగన్ ఏరికోరి తెచ్చుకున్నారన్న మాట.