https://oktelugu.com/

ఫోన్ ట్యాపింగ్: జగన్ సర్కార్ మెడకు ఉచ్చు బిగుస్తోందా?

తెలంగాణలో కేసీఆర్ ను డిపెన్స్ లో పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ ను కూడా అదే అస్త్రంతో కొట్టబోతున్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా కోర్టుల ద్వారా నడిపించేస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఏపీలో ఫోన్ ట్యాిపంగ్ వ్యవహారంలో ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయగా.. ఈ వ్యవహారంతో సంబంధం లేని విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్ సోమవారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) ఇప్పుడు జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2020 / 06:00 PM IST
    Follow us on


    తెలంగాణలో కేసీఆర్ ను డిపెన్స్ లో పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ ను కూడా అదే అస్త్రంతో కొట్టబోతున్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా కోర్టుల ద్వారా నడిపించేస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఏపీలో ఫోన్ ట్యాిపంగ్ వ్యవహారంలో ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయగా.. ఈ వ్యవహారంతో సంబంధం లేని విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్ సోమవారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) ఇప్పుడు జగన్ సర్కార్ మెడకు ఉచ్చుగా బిగుసుకుంటోంది. దీని వెనుక ఎవరున్నారన్నది తెలియకున్నా.. సీఎం జగన్ తోపాటు.. డీజీపీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఈ ఫోన్ ట్యాపింగ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.

    Also Read: ఆ ఎమ్మెల్యేలను జగన్ నిండా ముంచేశాడు..! ఇంకేం మిగిలిందని?

    సోమవారం దాఖలు చేసిన ఈ పిటీషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తునకు లేదా సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని పిటీషనర్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు తొలుత 16మందికి నోటీసులు జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వారి స్పందన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.

    ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీ హైకోర్టు తాజాగా సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి 16మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో సీబీఐతోపాటు రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

    హైకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ గా స్పందించడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థకు కళంకం తెస్తున్నారని పీటీషనర్ ఆరోపించారు. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తెలిసి హైకోర్టు దీనిపై సీరియస్ గా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

    Also Read: బాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.!

    ఈ క్రమంలోనే ఈ కేసు జగన్ సర్కార్ కు గుదిబండగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది.తెలంగాణలో ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు నాటి సీఎం చంద్రబాబు ఇదే ఫోన్ ట్యాపింగ్ ను కేసీఆర్ పై అస్త్రంగా సంధించారు. ఇప్పుడు అదే అస్త్రంతో జగన్ సర్కార్ ను కొట్టే ప్లాన్ చేశారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందనేది వేచిచూడాలి.