
రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. పిటీషనర్ లు, ప్రభుత్వం, ప్రస్తుత ఎస్.ఈ.సి కనగరాజ్ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఎన్నికల కమిషన్‌కు సంబంధించి చట్టంలో మార్పులు చెయ్యదానికి, ఆర్డినెన్స్ తీసుకురావడానికి రాష్ట్ర అధికారాలకు ఆర్టికల్ 243(కె) వ్యతిరేకంగా భావించలేమని న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనను వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. న్యాయవాదులు ఎల్ రవిచందర్, జ్వాలా నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా వాదించారు. న్యాయవాదులు వేదుల వెంకట రమణ, సత్య ప్రసాద్, జాంధ్యాల రవిశంకర్ నిమ్మగడ్డ తరుపున సమాధానం ఇచ్చారు. దీంతో ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు రిజర్వు చేసింది.
బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?
అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదనను వినిపించారు. సర్వీసు, పదవీ కాలం భిన్నంగా ఉన్నాయని, ఆర్టికల్ 243(కె) రమేష్ కుమార్ కు వర్తించదని ఆయన వాదించారు. న్యాయబద్ధంగా ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కొన్ని సంస్కరణను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, ఫలితంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆయన అన్నారు. మాజీ ఎస్‌ఇసికి వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యవహరించే ఉద్దేశ్యం ఇందులో లేదన్నారు. ఆయన కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు.
ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?
రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున అడ్వకేట్ సివి మోహన్ రెడ్డి (మాజీ అడ్వకేట్ జనరల్) తన వ్రాతపూర్వక వాదనను సోమవారం దాఖలు చేసేందుకు ధర్మాసనం అనుమతించింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఎన్నికల కమిషన్‌కు తగిన వ్యక్తి అని, ఆయన నియామకాన్ని విమర్శించడానికి వయస్సు ఒక కారణం కాదని ఎస్‌ఇసి కనగరాజ్ తరపున న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదించారు.