https://oktelugu.com/

ఏపీలో ఎన్నికల ‘పంచాయితీ’

ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పునివ్వడంతో ఇక ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అయితే ఇప్పుడు అందరి అటు ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వంపై పడింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని ప్రభుత్వం, అధికారులు ఇందుకు సహకరిస్తారా అని ప్రశ్నలు మొదలయ్యాయి. Also Read: బీజేపీని నీడలా వాడుతున్న టీడీపీ..! : నేతల హాట్‌ కామెంట్స్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకతతోనే ఉంది. ఉద్యోగులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 2:13 pm
    Follow us on

     AP local body elections
    ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పునివ్వడంతో ఇక ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అయితే ఇప్పుడు అందరి అటు ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వంపై పడింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని ప్రభుత్వం, అధికారులు ఇందుకు సహకరిస్తారా అని ప్రశ్నలు మొదలయ్యాయి.

    Also Read: బీజేపీని నీడలా వాడుతున్న టీడీపీ..! : నేతల హాట్‌ కామెంట్స్‌

    పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకతతోనే ఉంది. ఉద్యోగులు కూడా తమ విధులను నిర్వహించబోమని ఇప్పటికే తేల్చారు. ఎస్‌ఈసీపై దూషణలకు కూడా పాల్పడ్డారు. ఉద్యోగ సంఘ నేతలు ఈ మేరకు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాము ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోమని ప్రకటించారు. బహిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వపెద్దలే వీరితో ఇలా చెప్పించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినా.. ఎవరు చెప్పినా.. ఉద్యోగుల వ్యతిరేకత తేలిపోయింది.

    చివరికి ఎస్‌ఈసీలో పని చేయడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా లేరనేది వెల్లడైంది. దీంతో ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నిర్వహణ ఎలా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఉద్యోగ సంఘాలు.. ఆరు నూరైనా తాము సహకరించబోమని చెబుతున్నాయి. ఇందులో పోలీస్ అధికారుల సంఘం కూడా ఉంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును గౌరవించి తాము ఎన్నికల నిర్వహణలో పాల్గొంటామని అంటారో లేక బహిష్కరిస్తమని ప్రకటిస్తారో అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.

    Also Read: తిరుపతి విషయంలో ఏం చేస్తాడో..: జనసేన కార్యకర్తల్లో టెన్షన్‌

    ప్రస్తుతానికి ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం సైలెంట్ మోడ్‌లో ఉంది. వ్యూహాత్మకంగా చర్చలు జరుపుతోంది. హైకోర్టు తీర్పును గౌరవించాలా లేకపోతే మొండిగా.. ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న వాదనకే కట్టుబడి ఉండాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎదురుదాడికే సిద్ధమయితే ఉద్యోగ సంఘాలకు సమాచారం వెళ్తుంది. దాంతో వారు మీడియా ముందుకు వచ్చి.. ఎన్నికల నిర్వహణకు తాము సహకరించే ప్రసక్తే లేదని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు ఎస్‌ఈసీనే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర బలగాలను పిలిపించి.. మొత్తం ఆన్ లైన్ చేసి ఎన్నికలు నిర్వహించినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం మీదనే ఇదంతా ఆధారపడి ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్