https://oktelugu.com/

ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్ గురువారం అందనంత ఎత్తుకు పాకింది. భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్రలో ఈరోజు సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉద‌యం తొలిసారి ఏకంగా 50 వేల మార్క్‌ను దాటింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడి 50, 126.73 పాయింట్లకు చేరింది. అదేవిధంగా నిఫ్టీ కూడా తొలిసారిగా 14, 700 మార్కును చేరుకుంది. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పతనమైన సెన్సెక్స్.. ఒక్కసారిగా ఊపందుకోవడంతో షేర్ హోల్డర్స్, కంపెనీల […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 / 02:27 PM IST
    Follow us on


    స్టాక్ మార్కెట్ గురువారం అందనంత ఎత్తుకు పాకింది. భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్రలో ఈరోజు సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉద‌యం తొలిసారి ఏకంగా 50 వేల మార్క్‌ను దాటింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడి 50, 126.73 పాయింట్లకు చేరింది. అదేవిధంగా నిఫ్టీ కూడా తొలిసారిగా 14, 700 మార్కును చేరుకుంది. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పతనమైన సెన్సెక్స్.. ఒక్కసారిగా ఊపందుకోవడంతో షేర్ హోల్డర్స్, కంపెనీల యాజమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

    Also Read: ట్రంప్‌ కొత్త పార్టీ..! : అనౌన్స్‌ మాత్రం ఇప్పుడు కాదట

    రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ. 24,713 కోట్లకు కొనడం.. దాన్ని సెబీ అప్రూవ్ చేయడంతో మార్కెట్లకు కొత్త కళ సంతరించుకుంది. దీనికి తోడు అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం చేయడం కూడా భారత సెన్సెక్స్‌కు బాగా కలిసొచ్చింది. బైడెన్ రాకతో అమెరికా మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. అదే దూకుడు భారత మార్కెట్లపై కూడా కొనసాగుతోంది. పెట్టుబడులపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలు తొలగుతాయనే ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి అనేది కూడా ఒక వాదనగా కనిపిస్తోంది.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

    క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా గ‌త మార్చి నెల‌లో 25,638 పాయింట్లకు ప‌డిపోయిన సెన్సెక్స్‌.. 10 నెలల కాలంలోనే అంత‌కు రెట్టింపు స్థాయికి చేరడం విశేషం. మొత్తంగా బైడెన్‌ ప్రమాణ స్వీకారంంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దీని ప్రభావం భార‌త మార్కెట్లపై సానుకూలంగా కనిపించింది. అమెరికా నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారంతో మదుపురులు మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బైడెన్ త్వరలో పలు ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెడతారని వారు భావిస్తున్నారు. ఇక మనదేశంలోనూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్‌పై పాటిజివ్ అప్ డేట్ వస్తుండటంతో పెట్టుబడిదారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్