ఏపీకి హైదరాబాద్ పై సంపూర్ణ హక్కులు: వీర్రాజు

హైదరాబాద్ కేసీఆర్ సొంతం కాదని.. విభజన హామీల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ పై సంపూర్ణ హక్కులు కలిగివున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని ఏపీ కోవిడ్ రోగుల అంబులెన్స్ లు రానీయకపోవడంపై సోము వీర్రాజు మండిపడ్డారు. మీడియా సమావేశంలో కేసీఆర్ సర్కార్ తీరును కడిగిపారేశారు. ఆంధ్ర తెలంగాణా సరిహద్దుల్లో అంబులెన్స్ నిలుపుదల ను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. దేశానికే కాక ప్రపంచానికి హైదరాబాద్ […]

Written By: NARESH, Updated On : May 14, 2021 2:14 pm
Follow us on

హైదరాబాద్ కేసీఆర్ సొంతం కాదని.. విభజన హామీల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ పై సంపూర్ణ హక్కులు కలిగివున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని ఏపీ కోవిడ్ రోగుల అంబులెన్స్ లు రానీయకపోవడంపై సోము వీర్రాజు మండిపడ్డారు. మీడియా సమావేశంలో కేసీఆర్ సర్కార్ తీరును కడిగిపారేశారు.

ఆంధ్ర తెలంగాణా సరిహద్దుల్లో అంబులెన్స్ నిలుపుదల ను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. దేశానికే కాక ప్రపంచానికి హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా వెలుగొందుతుందని.. అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని.. అలాంటిది తెలంగాణకే పరిమితం చేయడం భావ్యం కాదన్నారు. ఈ విషయంలో ఏపీ వాసులకు అన్యాయం జరిగితే ఊరుకోమని సోము వీర్రాజు అన్నారు.

కేసీఆర్ వైఖరి హైకోర్టు తీర్పు ధిక్కరణ కిందకు వస్తుందని.. తన మొండి వైఖరి మార్చుకోవాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ నిలుపుదలతో రెండు నిండుప్రాణాలు పోయాయని.. దీనికి కేసీఆర్ నే బాధ్యత వహించాలని భాజపా తరుఫున డిమాండ్ చేస్తున్నట్టు సోమువీర్రాజు తెలిపారు. సరిహద్దు అంశాలపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడానని సోము తెలిపారు.

ఇక తెలంగాణలోకి ఏపీ అంబులెన్స్ లను రానీయకపోవడాన్ని ఊరికే వదిలిపెట్టమని.. కేసీఆర్ సర్కార్ ను ఎండగడుతామని.. ఇలాంటి అంశాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కేంద్రానికి లేఖ రాస్తామని సోము వీర్రాజు తెలిపారు.