https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : అనసూయతో మరో స్పెషల్ హాట్ ప్రోగ్రామ్ !

తెలుగు టీవీ యాంకర్లు అంటే ఒకప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుని, గంభీరమైన టోన్ లో చెప్పిందే చెబుతూ తెగ విసిగించేవారు. కానీ, ఆ యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడి, యాంకరింగ్ కి కూడా గ్లామర్ టచ్ ఇచ్చి మొత్తానికి బుల్లితెరను కూడా తన అందచందాలతో ఒక ఊపు ఊపేస్తోంది భారీ బ్యూటీ అనసూయ భరద్వాజ్. నిజానికి జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో మొదట కామెడీ కంటే కూడా అనసూయ అందాలే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే […]

Written By:
  • admin
  • , Updated On : May 14, 2021 / 02:10 PM IST
    Follow us on

    తెలుగు టీవీ యాంకర్లు అంటే ఒకప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుని, గంభీరమైన టోన్ లో చెప్పిందే చెబుతూ తెగ విసిగించేవారు. కానీ, ఆ యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడి, యాంకరింగ్ కి కూడా గ్లామర్ టచ్ ఇచ్చి మొత్తానికి బుల్లితెరను కూడా తన అందచందాలతో ఒక ఊపు ఊపేస్తోంది భారీ బ్యూటీ అనసూయ భరద్వాజ్.

    నిజానికి జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో మొదట కామెడీ కంటే కూడా అనసూయ అందాలే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే అప్పట్లో ఈ ప్రోగ్రామ్ కి ఎక్కువగా యూతే ఫాలోవర్స్ గా ఉండేవాళ్లు. ఆ తరువాత కాలంలో మంచి కమెడియన్లు రావడం, మొత్తానికి జబర్దస్త్ లో పంచ్ లు కూడా పేలడంతో ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది. అన్నిటికీ మించి అనసూయ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

    అయితే జబర్దస్త్ టీమ్ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇలాంటి ప్రోగ్రామ్ ను మరొకటి పెట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ పోగ్రామ్ లో అనసూయనే యాంకరింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది సదురు నిర్మాణ వ్యవస్థ. పైగా ఇక్కడ మరో కండిషన్ కూడా పెట్టారు. ప్రతి ఎపిసోడ్ లో అనసూయ కూడా రెండు ఓల్డ్ ఐటమ్ పాటలకు డ్యాన్స్ చేయాలట.

    అంటే, ఆ కాలంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని చేసిన సాంగ్స్ అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ అనసూయ చేత చేయించి.. ఫుల్ క్యాష్ చేసుకోవాలని ఆ బడా బుల్లితెర నిర్మాణ సంస్థ గట్టిగా ప్లాన్ చేసింది. ఎలాగూ అనసూయకి స్లీవ్ లెస్ ధరించడం ఆనవాయితీ. అలాగే అవసరం లేకపోయినా అందాలను ప్రదర్శించడం అనసూయకు అలవాటు. పైగా ఐటమ్ సాంగ్స్ చేయడంలో అనసూయకు అనసూయే సాటి. కాబట్టి, ఓల్డ్ సాంగ్స్ లో అనసూయ రెచ్చిపోవడం ఖాయం.