కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఏపీలో ఆస్పత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కోవిడ్ ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోనుంది. ఫీజుల వసూళ్లు తదితరాలపై పారదర్శకత వస్తుందని హైకోర్టు సూచించింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సరైనదే అని తెలుస్తోంది.
మహారాష్ర్ట, గోవా బాటలో..
మహారాష్ర్ట, గోవాలలో ప్రైవేటు ఆస్పత్రులను సైతం ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో అక్కడ పెరిగిపోతున్న ఫీజుల దోపిడీ ఉండకపోవచ్చు. దీనికి ప్రభుత్వం ఆస్పత్రుల బాధ్యత తీసుకుంటుంది. దీంతో కరోనా రోగులకు భారం తప్పుతుంది. చికిత్సల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేసే ఆగడాలకు కళ్లెం వేసినట్లవుతుంది.
అప్పడప్పుడు తనిఖీలు
రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే చికిత్సల గురించి తనిఖీలు నామమాత్రమయ్యాయి. దీంతో అవి హద్దు మీరి ఫీులు వసూలు చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ రోగులకు చికిత్సల విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే వైద్యం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ అసలు విషయాలు బయటకు రావడం లేదు. హైకోర్టు సూచనలతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
వివరాలకు మూలం
ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తే రోగులు, చికిత్స పొందుతున్న రోగులు బయటకు వెళ్తున్న రోగులు, ఆక్సిజన్, ఫీజలు తదితర విషయాలపై అవగాహన కలుగుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలకు చెక్ పడుతుంది. అందుకే హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులను తీసుకురావాలని భావిస్తోంది.