https://oktelugu.com/

అక్కడ పార్టీని గాలికొదిలేశారా..?

ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆచార వ్యవహారంలో గానీ రాజకీయంగా గానీ ఈ రెండు జిల్లాలను బేరీజు వేసుకుంటారు. ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకుంటే రాష్ట్రమంతటా రానించవచ్చని అనుకుంటారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఉభయగోదావరి జిల్లాలో ఒకప్పటి కంచుకోటగా ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ ఈ రెండు జిల్లాల్లో ఆరు సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడీ జిల్లాలో టీడీపీ మరింత దిగజారుతోంది. అసలే అంతంత మాత్రన ఇక్కడ టీడీపీ బలం ఉందనుకుంటున్న పార్టీ నాయకులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2021 / 03:06 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆచార వ్యవహారంలో గానీ రాజకీయంగా గానీ ఈ రెండు జిల్లాలను బేరీజు వేసుకుంటారు. ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకుంటే రాష్ట్రమంతటా రానించవచ్చని అనుకుంటారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఉభయగోదావరి జిల్లాలో ఒకప్పటి కంచుకోటగా ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ ఈ రెండు జిల్లాల్లో ఆరు సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడీ జిల్లాలో టీడీపీ మరింత దిగజారుతోంది. అసలే అంతంత మాత్రన ఇక్కడ టీడీపీ బలం ఉందనుకుంటున్న పార్టీ నాయకులకు ఇక్కడ కూడా పూర్తిగా కుచించుకుపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

    2019 ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి టీడీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉండీ ఉండనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలుగానే సాగుతుండడంతో పాటు అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కొన్ని నియోజవర్గాల్లో టీడీపీ ఇన్ చార్జులే లేరు. దీంతో పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

    ఈ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలే. మిగతా వారు పార్టీకి కొత్త నాయకులు. సీనియర్ గా ఉన్న నాయకులే పార్టీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి వారే రాజకీయాలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారని అంటున్నారు. ఇక ఇద్దరు పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రు లు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీని డిఫెన్స్లో పెట్టారు. అలాగని పార్టీకి దూరంగా ఉండడం లేదు.

    ఇక వీరు టీడీపీకి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం లేదు. దీంతో కిందిస్థాయి నాయకులు కూడా కలిసి రావడం లేదు. అసలే నియోజకవర్గ ఇన్ చార్జిలు లేక అంతంత మాత్రంగా పార్టీ సాగుతున్న తరుణంలో కొద్దో గొప్పో ఉన్న నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పార్టీకి పునర్వైభవం వస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడి సీట్లతోనే అధికారంలో కూర్చున్నారు. అలాంటి జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇలా మారితే పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయని అంటున్నారు.