https://oktelugu.com/

ఆ విషయంలో అందరికంటే ముందున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలులో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారు. దీంతో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయంపై దృష్టి పెడతారు. ప్రభుత్వ పథకాలు ఎవరూ ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లగలుగుతారనే వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా తెప్పించుకున్న నివేదికలో తాజాగా ఓ ఎమ్మెల్యేకు మంచి మార్కులు పడ్డాయట. ఆమె ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారట. ఇక్కడ ప్రత్యర్థి బలంగా ఉన్నా తనదైన శైలిలో పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారట. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2021 / 03:25 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలులో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారు. దీంతో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయంపై దృష్టి పెడతారు. ప్రభుత్వ పథకాలు ఎవరూ ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లగలుగుతారనే వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా తెప్పించుకున్న నివేదికలో తాజాగా ఓ ఎమ్మెల్యేకు మంచి మార్కులు పడ్డాయట. ఆమె ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారట. ఇక్కడ ప్రత్యర్థి బలంగా ఉన్నా తనదైన శైలిలో పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారట.

    గుజరాత్ కు చెందిన అమూల్ అనే సంస్థకు ఏపీకి చెందిన పాలు విక్రయించాలని, ఇందులో భాగంగా పాడి రైతులకు లబ్ధి చేకూరే విధంగా అనేకం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని పాడి రైతులు అమూల్ సంస్థకు పాలు అమ్మేలా చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే ఇటీవల ఈ విషయంలో ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నారట. వీరిలో ఓ ఎమ్మెల్యే బాగా పనిచేశారట.

    గుంటూరు జిల్లాలోని చిలకూరిపేట ఎమ్మెల్యే రజనీ అమూల్ సంస్థను ప్రమోట్ చేయడంలో ముందున్నారట. తన నియోజకవర్గంలోని గ్రామ పాడి రైతులు ఆ సంస్థకు పాలు అమ్మేలా రకరకాలుగా ప్రచారం చేశారట. ఇందుకు కృషి చేసిన రజనీకి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు జగన్ కు సమర్పించారట. దీంతో ఆమె పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    అయితే మిగతా ఎమ్మెల్యేలు జగన్ కు అనుకూలంగా ఉంటున్నా కొన్ని సంక్షేమ పథకాల విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ ప్రజా పాలన విషయాన్ని పక్కనబెట్టారు. అయితే చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి బలమైన నేతలు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా.. వాటిని అధిగమించి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమెపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.