https://oktelugu.com/

అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

దేవుడిని సైన్స్ ను మిక్స్ చేసి సూపర్ హిట్ తో పాటు కొత్త ఫీల్ తెచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎప్పటినుండో ప్లాన్ లో ఉన్నా మొత్తానికి అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది. యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రానున్న ఈ సీక్వెల్ లో ప్రస్తుతం హీరోయిన్ ను ఫైనల్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. నిజానికి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ […]

Written By:
  • admin
  • , Updated On : August 8, 2020 / 02:24 PM IST
    Follow us on


    దేవుడిని సైన్స్ ను మిక్స్ చేసి సూపర్ హిట్ తో పాటు కొత్త ఫీల్ తెచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎప్పటినుండో ప్లాన్ లో ఉన్నా మొత్తానికి అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది. యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రానున్న ఈ సీక్వెల్ లో ప్రస్తుతం హీరోయిన్ ను ఫైనల్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. నిజానికి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం కోసం మొదట అనుకున్నారు. అనుపమ కూడా చేస్తానని కమిట్ అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ దెబ్బకు నిర్మాతలు సినిమాలోని నటీనటులకు రెమ్యునరేషన్ తగ్గించారట. అందరూ కోపరేట్ చేయాలని అడిగినప్పటికీ అనుపమ మాత్రం మొదట ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఇస్తేనే యాక్ట్ చేస్తాను లేదంటే లేదు అని తేల్చేసింది.

    Also Read: తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

    నిర్మాతకు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే ఇంట్రస్ట్ లేదు. దాంతో అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మను తీసుకోబోతునట్లు తెలుస్తోంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా కేతిక శర్మ అయితేనే ఫ్రెష్ గా ఉంటుందని ఆమెనే ఫైనల్ చేయనున్నారు. చిత్రబృందం హీరోయిన్ కేతిక శర్మతో మాట్లాడారట. అన్నట్లు ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ గా ఉండబోతున్నాయట. ఏమైనా తన మొదటి సినిమా ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్నాడు చందు.

    Also Read: అలా లేకుంటే నన్నెవరూ ఆదరించరు: శ్రీదేవి కూతురు

    మరి చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తుండగా.. నిఖిల్ కూడా బిజినెస్ పార్టనర్ గా ఉన్నాడు. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నా.. మొదట అక్టోబర్ లో సాంగ్స్ షూట్ చేయాలనుకుంటున్నారు.