https://oktelugu.com/

ఏంటిది.. అభిమానులందరికీ షాకిచ్చిన చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి అంటే ఎలా ఉంటాడు.. ఆ స్టైలూ.. ఆ గ్రేసు, ఆ డ్యాన్సు, డైలాగులూ.. అబ్బో ఆయన స్టైలే వేరు. తెలుగు తెరను ఏలుతున్న చిరంజీవి ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. చిరంజీవి లుక్స్ చూసి ఆయన తనయుడు రాంచరణ్ సైతం ‘నాన్న నేను చూస్తున్నది నిజమేనా?’ అంటూ షాక్ కు గురయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. Also Read: అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 09:17 PM IST
    Follow us on

    మెగా స్టార్ చిరంజీవి అంటే ఎలా ఉంటాడు.. ఆ స్టైలూ.. ఆ గ్రేసు, ఆ డ్యాన్సు, డైలాగులూ.. అబ్బో ఆయన స్టైలే వేరు. తెలుగు తెరను ఏలుతున్న చిరంజీవి ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. చిరంజీవి లుక్స్ చూసి ఆయన తనయుడు రాంచరణ్ సైతం ‘నాన్న నేను చూస్తున్నది నిజమేనా?’ అంటూ షాక్ కు గురయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు.

    Also Read: అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ?

    కరోనా వైరస్ -లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో ఈ ఖాళీ సమయాన్ని చిరంజీవి ఎంజాయ్ చేస్తున్నారు. అనేక వ్యాపకాలతో గడిపేస్తున్నారు.

    ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి ఓ ఫొటో పంచుకున్నారు. అది చూసి అభిమానులు షాక్ అయ్యారు. చిరంజీవి గుండు చేయించుకొని నల్లటి అద్దాలతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘నేను సాధువులా ఉన్నానా’ అంటూ అర్బన్ మాంక్ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

    ఈ ఫొటో వైరల్ అయ్యింది. అభిమానులు చిరంజీవి గుండు లుక్ చూసి షాక్ అవుతూ కామెంట్లు, లైక్ లు పెడుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

    Also Read: సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా

    చిరంజీవి నిజంగా గుండు చేయించుకున్నాడా? లేక యాప్ లోనా? ఫొటో షాప్ లో ఇలా చేయించుకున్నాడా అన్నది తెలియడం లేదు.