https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం..! ఏర్పాట్లు రెడీ చేస్తున్న అధికారులు..

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిపాటు వణికించిన కరోనా వైరస్ ను తరిమే రోజులు వస్తున్నాయి. కరోనాను నిరోధించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్లు సిద్ధమవగా వాటిని పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్ తో పాటు ఇండియాలోనూ కరోనా వ్యాక్సిన్ తయారవుతోంది. మొత్తంగా కంపెనీలు ఏదైనా వ్యాక్సిన్ నుంచి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేలితేనే దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం చేసుకోవాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2020 / 01:02 PM IST
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిపాటు వణికించిన కరోనా వైరస్ ను తరిమే రోజులు వస్తున్నాయి. కరోనాను నిరోధించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్లు సిద్ధమవగా వాటిని పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్ తో పాటు ఇండియాలోనూ కరోనా వ్యాక్సిన్ తయారవుతోంది. మొత్తంగా కంపెనీలు ఏదైనా వ్యాక్సిన్ నుంచి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేలితేనే దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయం కూడా ఉంటుందని తెలిపారు.

    Also Read: కేసీఆర్ ఇలా ఎందుకు మారారు..? హరీశ్ రావును అంతలా ఎందుకు పొగిడారు..?

    ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 5.45 లక్షల లీటర్ల పైబడి వ్యాక్సిన్ నిల్వకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో వాక్ ఇన్ కూలర్స్, ఐఎల్ఆర్ఐఎస్ లీన్డ్ రిఫ్రిజిరేటర్స్ తో పాటు వాక్ ఇన్ ఫ్రీజర్స్, డీఎఫ్ డీప్ ఫ్రీజర్స్ వాటని రెడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న వాటికంటే మరో ఆరు వాకింగ్ కూలర్లను కేంద్రప్రభుత్వం పంపనుంది. ఆంధ్రప్రదేశ్ కు తమిళనాడు నుంచి కరోనా వ్యాక్సిన్ రానుంది.

    మరి ప్రజలకు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు..? అన్న సందేహం కలుగుతోంది. వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదని.. ప్రతి ఒక్కరు తీసుకుంటేనే బెటరని.. వాదోపవాదనలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు మొత్తం కలిపి సుమారు 3 లక్షల మందికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత 50 నుంచి 60 ఏళ్లు మధ్య కోటి మందికి, 60 ఏళ్లు దాటిన 75 లక్షల మందికి వ్యాక్సిన అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read: విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తున్నారా?

    ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు నమోదు చేసుకొని వ్యాక్సిన్ ఇస్తారు. ప్రతీ వ్యాక్సిన్ 10 డోసుల వయెల్స్ ఉంటుంది. ఒకటి వేసిన తరువాత ఆరు నెలల తరువాత రెండో డోసు వేస్తారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత 30 నిమిషాలు వరకు రోగి ఆరోగ్య కేంద్రంలోనే ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే వెంటనే చికిత్స అందించడానికి సిద్ధంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరోవైపు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన సిరంజీలను కూడా సిద్ధం చేశారు. ఈనెల 25న వ్యాక్సిన్ పంపిణీకే కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకా ఇచ్చే అవకాశం ఉంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్