
Dasara 2021 celebrations: ఆంధ్రప్రదేశ్ లో పండుగల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంది. కరోనా సాకుతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించొద్దని ఆంక్షలు విధించి వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. సున్నితమైన విషయాల్లో రాజకీయాలు వద్దని సూచిస్తున్నా పెడచెవిన పెట్టారు. దీంతో అందరి దృష్టిలో విలన్ గా ముద్ర పడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ అప్రదిష్ట నుంచి తప్పించుకున్నారు. దసరా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని సూచించారు.
వినాయక చవితికి పెద్ద పెద్ద మంటపాలు ఏర్పాటు చేసే అవకాశమున్నందున అనుమతి నిరాకరించినా ప్రజల్లో మాత్రం పరువు పోయింది. దీంతో దసరాపై కూడా ఇలాంటి తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. దసరా ఉత్సవాలపై ఆంక్షలు విధించకుండా జరుపుకోవచ్చని చెబుతోంది.
వినాయక చవితి వేడుకలకు అనుమతి నిరాకరించడంతో అందరిలో ఆగ్రహం పెరిగింది. అలాంటి తప్పిదం మరోసారి ఇలా చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయినా దసరా వేడుకలకు ప్రభుత్వం ముందస్తుగా అనుమతి ఇవ్వడంతో పోయిన పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
మొత్తానికి దసరా ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షల సడలింపుతో ప్రజల నుంచి వచ్చే విమర్శలను తప్పించుకుంది. దీంతో రాష్ర్టంలో ఉత్సవాలు జరుపుకునే క్రమంలో నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.