https://oktelugu.com/

AP Movie Ticket Rates: మూవీ టికెట్ల విషయంలో కళ్లు తెరుచుకున్నారా..? అలాగే ఉంటుంది మరి..

AP Movie Ticket Rates:  ఏపీలో మూవీ టికెట్లపై రేట్ల విషయం ఇంకా చల్లారలేదు. ఇక పెద్ద మూవీస్ రిలీజ్ అయితే ఆ హీరోల ఫ్యాన్స్ చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. మూవీ టికెట్ల ధరలు ఇంతేనా అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. దీనికి ప్రతి పక్షాలు సైతం తోడవుతున్నాయి. కానీ వాస్తవానికి మాత్రం పెంచిన రేట్లు కొద్ది రోజులు మాత్రమే అమలయ్యాయి. కానీ థియేటర్ల యాజమాన్యాలు రేట్లు అడ్డగోలుగా పెంచేసి టికెట్టు అమ్మేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 19, 2022 / 02:27 PM IST
    Follow us on

    AP Movie Ticket Rates:  ఏపీలో మూవీ టికెట్లపై రేట్ల విషయం ఇంకా చల్లారలేదు. ఇక పెద్ద మూవీస్ రిలీజ్ అయితే ఆ హీరోల ఫ్యాన్స్ చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. మూవీ టికెట్ల ధరలు ఇంతేనా అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. దీనికి ప్రతి పక్షాలు సైతం తోడవుతున్నాయి. కానీ వాస్తవానికి మాత్రం పెంచిన రేట్లు కొద్ది రోజులు మాత్రమే అమలయ్యాయి. కానీ థియేటర్ల యాజమాన్యాలు రేట్లు అడ్డగోలుగా పెంచేసి టికెట్టు అమ్మేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ రిలీడ్ అవుతుండటంతో టికెట్ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

    AP Movie Ticket Rates:

    ఇందుకు ఆ శాఖ మంత్రి స్పందిస్తూ.. రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్ల బడ్జెట్‌తో మూవీ నిర్మిస్తే… ఆ మూవీకి సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకోవచ్చని చెప్పారు. ఇక తెలంగాణ లో మాత్రం టికెట్ రేట్లకు అడ్డు లేకుండా పోయింది. మూవీ వాళ్లు అడినంతగా కాకపోయిన కాస్తో అటూ ఇటూ ఏపీలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.75 పెంచుకునే చాన్స్ ఇచ్చారు.

    Also Read:   అనుకూలంగా తీస్తే అంతే.. ‘ది కశ్మీర్ ఫైల్స్ ’ దర్శకుడికి వై కేటగిరి భద్రత కల్పించిన మోడీ సర్కార్

    ఈ కారణంగా ఫస్ట్ వీక్ రేట్లు ఎలా ఉన్నా జనాలు చూస్తారు. కానీ తర్వాత ఎక్కువ రేట్లు పెట్టు ఎవరు చూస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఫస్ట్ వీక్ టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు నడిచే చాన్స్ ఉంది. కానీ ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా.. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల మూవీ ఇండస్ట్రీ కుదేలవుతోందని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఇప్పుడు జ‌నాలు డబ్బులు ఉన్న వారు అయిపోయారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే చిన్న మూవీలకు సరైన్ ఓపెనింగ్స్ దక్కడం లేదు. ఇక మూవీ రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో వచ్చేస్తుంది. ఈ విషయం జనాలకు సైతం తెలుసు. ఇక ఇలాంటి మూవీస్ ను ఓటీటీలోనే చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

    AP Movie Ticket Rates:

    ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్ చేసి భీమ్లా నాయ్ వంటి పెద్ద మూవీలకు సైతం చాలా ఏరియాల్లో జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. దాదాపు నేరుగా డిస్ట్రిబ్యూట్ చేసిన రాధేశ్యామ్ నిర్మాతలు చాలానే పోగొట్టుకున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ బయ్యర్లు 80 శాతం నష్టపోయారు. ఇక ఊపు మీద వచ్చి డీజే టిల్లు సైతం కనీస లాభాలతోనే సరిపెట్టుకుంటోంది. దీంతో పాటు చాలా మూవీస్ నష్టపోయాయి. ఇక తాజాగా కొత్త రేట్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత అన్ని రకాల మూవీస్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. టికెట్ రేట్లు, ఓటీటీ ఎఫెక్ట్ పక్కాగా ఉంటుందనేది వాస్తవం.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ రేట్లు భారీగా పెంపు.. ప్రేక్షకులకు ఇది షాక్!

    Recommended Video:

    Tags