https://oktelugu.com/

AP Cabinet Expansion 2022: మంత్రివర్గ విస్తరణపై మళ్లగుల్లాలు.. జగన్ మదిలో ఉన్నదెవరో?

AP Cabinet Expansion 2022: మంత్రివర్గ విస్తరణపై జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే మంత్రులకు సంకేతాలు జారీ చేయడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎవరి పదవులు పోతాయో కొత్తవారికి ఎవరికి స్థానం లభిస్తుందో తెలియడం లేదు. దీంతో అన్ని వర్గాల్లో ఆందోళన ఏర్పడుతోంది. తమకు మంత్రి పదవులు దక్కుతాయో లేదోననే బెంగ పట్టుకుంది. దీనికి తోడు కేబినెట్ పదవులపై ఆశలు పెంచుకున్న వారికి అందలాలు దక్కేనా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు జగన్ మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2022 / 03:03 PM IST
    Follow us on

    AP Cabinet Expansion 2022: మంత్రివర్గ విస్తరణపై జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే మంత్రులకు సంకేతాలు జారీ చేయడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎవరి పదవులు పోతాయో కొత్తవారికి ఎవరికి స్థానం లభిస్తుందో తెలియడం లేదు. దీంతో అన్ని వర్గాల్లో ఆందోళన ఏర్పడుతోంది. తమకు మంత్రి పదవులు దక్కుతాయో లేదోననే బెంగ పట్టుకుంది. దీనికి తోడు కేబినెట్ పదవులపై ఆశలు పెంచుకున్న వారికి అందలాలు దక్కేనా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు జగన్ మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే ఓ ఆలోనతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

    JAGAN

    ఈ నేపథ్యంలో స్పీకర్ పదవిపై కూడా అందరిలో చర్చ జరుగుతోంది. ఇదివరకే ఉన్న తమ్మినేని సీతారంను కొనసాగిస్తారా? లేక ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తారా? అని సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే సీతారాం మంత్రి పదవి కావాలని అడుగుతుండటంతో ఆయన స్థానంలో ఇంకెవరికి అవకాశం ఇస్తారో తెలియడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొందరికి జిల్లా ఇన్ చార్జులుగా బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

    Also Read: ఓవర్ టూ ఫామ్ హౌస్: కేసీఆర్ ఎమెర్జెన్సీ మీటింగ్ కథేంటి?

    సామాజిక సమీకరణల్లో భాగంగా తమ్మినేని బీసీ కావడంతో స్పీకర్ పదవి బీసీ వర్గానికే కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఈసారి మహిళకు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడుతుంది. దీంతో ఆ పదవిని మహిళతో భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పదవికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు కేటాయిస్తారనే వాదన కూడా వస్తోంది. శాసన మండలి చైర్మన్ గా కూడా మహిళనే నియమించే సూచనలు కనిపిస్తున్నాయి.

    CM Jagan

    ఎస్టీ వర్గానికి చెందిన రాజన్న దొర, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆనం పేరు ఫైనల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం కావడంతో రాజన్నదొర, ధర్మాన పేర్లు ప్రచారంలో సాగుతున్నాయి. మొత్తానికి జగన్ మదిలో ఏముందో ఎవరికి తెలుసు. మంత్రివర్గ విస్తరణపై అప్పుడే అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సారి తమకు మంత్రి పదవి ఖాయమనే ధీమాలో చాలా మంది నేతలు ఉన్నట్లు సమాచారం.

    Also Read:  ఉద్యోగ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ సడలింపు… కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు..

    Tags