https://oktelugu.com/

KCR Emergency Meeting: ఓవర్ టూ ఫామ్ హౌస్: కేసీఆర్ ఎమెర్జెన్సీ మీటింగ్ కథేంటి?

KCR Emergency Meeting: తెలంగాణలో రాజకీయాలు ఏడేళ్లుగా ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్ లో అడుగుపెట్టడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక సమావేశాలు మంత్రివర్గ సమావేశాలు కలెక్టర్లతో మీటింగ్ లు అన్ని ప్రగతి భవన్ లోనే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే శనివారం పాలన కేంద్రాన్ని మార్చారు.. అధికారిక మంత్రివర్గ సమావేశాన్ని ఎర్రవెల్లి లోని తన ఫాంహౌస్లో అత్యవసరంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు . అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 02:14 PM IST
    Follow us on

    KCR Emergency Meeting: తెలంగాణలో రాజకీయాలు ఏడేళ్లుగా ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్ లో అడుగుపెట్టడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక సమావేశాలు మంత్రివర్గ సమావేశాలు కలెక్టర్లతో మీటింగ్ లు అన్ని ప్రగతి భవన్ లోనే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే శనివారం పాలన కేంద్రాన్ని మార్చారు.. అధికారిక మంత్రివర్గ సమావేశాన్ని ఎర్రవెల్లి లోని తన ఫాంహౌస్లో అత్యవసరంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు . అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సమావేశానికి అర్జంట్ గా రావాలని అని ఫాంహౌస్ నుంచి ఫోన్లు వెళ్లాయి.

    CM KCR

    ఫోన్ రావడమే ఆలస్యం అన్నట్లు వివిధ పనుల్లో ఉన్న మంత్రులు అందరూ హడావిడిగా ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఉన్నందున సమావేశానికి రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇ మహారాష్ట్రలో అధికారిక పర్యటనలో ఉన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తన సొంత జిల్లాలో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు మినహా మిగతా అందరూ ఫాంహౌస్ చేరుకున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత కు ఆహ్వానం అందడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: ఉద్యోగ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ సడలింపు… కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు..

    – పీకే రిపోర్టు పై చర్చ?

    కేసీఆర్ ఫాంహౌస్ లో ఏర్పాటు చేసిన ఈ అత్యవసర సమావేశంలో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక పై చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించి ప్రశాంత్ కిషోర్ ఇటీవలే సీఎం కేసీఆర్ కు నివేదిక అందించినట్టు తెలిసింది. ఇందులో తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. తీసుకోవాల్సిన మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. ఇవే కేసీఆర్ ఫాంహౌస్ లో ప్రధాన అజెండాగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.దీన్నే బట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా? బీజేపీని ఎలా కాచుకోవాలి? కేటీఆర్ ను సీఎం చేద్దామా? అన్న విషయాలపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

    -ఉద్యోగ నోటిఫికేషన్ల పైనా..?

    ఫాంహౌస్ లో నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశంలో విడుదల చేయాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ లపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఉద్యోగ ఖాళీలు ప్రకటించి వారం రోజులు దాటింది. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అయితే వారం దాటినా దీనికి సంబంధించి ఎలాంటి జీవో విడుదల చేయలేదు. తక్షణమే నోటిఫికేషన్లు జారీ అవుతాయని కేసీఆర్ ప్రకటించారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం నిజమవుతుందని ఆందోళన నెలకొంది. పీకే సర్వే మేరకే ఉద్యోగ ఖాళీలు ప్రకటించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఖాళీలు ప్రకటించి వదిలేస్తే మళ్లీ జనంలోకి తప్పుడు సమాచారం వెళ్తుందని సూచనతో రెండు మూడు రోజుల్లో లేదా ఉగాదికి నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మొదట యూనిఫామ్ ఉద్యోగాలు అయినా పోలీస్ శాఖలో భర్తీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ను రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మిగతా నోటిఫికేషన్లు కూడా ఎప్పుడు ఇవ్వాలనే దానిపై మంత్రివర్గ సమావేశం లో చర్చించి నట్లు తెలిసింది.

    CM KCR

    -బీజేపీ వ్యూహం పైన చర్చ

    – భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలకు తెర లేపింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే 60 మంది స్ట్రాటజీస్ట్ లతో ఇప్పటికే ఎన్నికల వ్యూహం రచిస్తోంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపైన కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. బీజేపీ కీలక నేతలు కూడా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వారు చేసే విమర్శలు ఇలా తిప్పికొట్టాలి ప్రభుత్వ ఆలోచనను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజలను తమవైపు ఎలా తీసుకోవాలి అన్న అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

    Also Read:  తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

    Tags