AP Govt: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు 130 ఎకరాలు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. దీంతో బడా సంస్థలకు ధారాదత్తం చేసేందుకు భూములు కేటాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయనే అపవాదును మూటగట్టుకుంటోంది జగన్ ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో పేదవారికైతే ఎలాంటి మేలు చేయని ప్రభుత్వాలు ఉన్న వారికే వత్తాసు పలుకుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే 130 ఎకరాల భూమిని అప్పనంగా అప్పజెప్పేందుకు ముందుకు వస్తోందని సమాచారం. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ఇప్పుడు అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బడా కంపెనీలకు భూములు అప్పగించి పేదలకు ఏం మిగిల్చకుండా చేస్తున్నారని చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలు చేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టసవరణకు ఆమోదం తెలిపింది. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశాలపై సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు, అమ్మఒ:డి పథకానికి 75 శాతం హాజరు ఉండాలని పలు విషయాలపై ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించింది.
Also Read: Miss Telangana: ఆత్మ హత్య చేసుకుంటూ లైవ్ వీడియో పెట్టిన… మాజీ మిస్ తెలంగాణ
వచ్చే నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. దీంతో ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు నిస్సందేహంగా అందనిని ఆశ్చర్యానికి గురి చేస్తాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్: ఈ కీలక అంశాలే ఏజెండా.. వరాలుంటాయా??