Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బాలీవుడ్ ఆడియెన్స్ నుంచి కూడా అల్లు అర్జున్ కి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎట్టకేలకు తన ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” ఫస్ట్ పార్ట్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు బన్నీ. అయితే నిన్న జరిగినటువంటి వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ కి అక్కడి బడా నిర్మాతలు, మేకర్స్ అందరికీ బాగా నచ్చాయని చెప్పాలి. ఈ మేరకు వారంతా అల్లు అర్జున్ మంచితనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

హైదరాబాద్‌లో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. లక్ష్మీసౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ కార్యక్రమంలో అల్లౌ అర్జున్ తో పాటు , ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, తమన్ పాల్గొన్నారు. ఈ మేరకు నిన్న ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ… విడుదల కాబోతున్న పలు బాలీవుడ్ సినిమాలు కోసం కూడా మాట్లాడ్డం జరిగింది.
https://twitter.com/karanjohar/status/1453557058339360782?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453557058339360782%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-4114610265741728605.ampproject.net%2F2110152252002%2Fframe.html
కరోనా మూలాన బాలీవుడ్ జనం థియేటర్స్ వరకు వచ్చి సినిమా చూడటానికి సాహసించట్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగు కావడంతో… మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు రావాలని అక్కడి మేకర్స్ భావిస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న సూర్యవంశీ సినిమా బృందానికి కూడా బన్నీ… తన విశేస్ తెలియజేయడం… ప్రజలంతా ధియేటర్లకు రావాలని కోరడం తెలిసిన విషయమే. దీనితో బాలీవుడ్ బడా ఫిలిం మేకర్స్ రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ లు బన్నీ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు.