AP Govt: ఆంధ్రప్రదేశ్ లో అప్పుల భారం పెరిగిపోతోంది. రోజు వారి నిర్వహణ కోసం రాష్ర్టం అప్పుల ఊబిలోనే కూరుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.25 వేల కోట్ల రుణం విషయంలో కేంద్రం ప్రస్తుతం ఇరుకున పడింది. తన అభిప్రాయం చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నింటిని సమర్పించాలని ఆదేశించింది.

ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకుందని పేర్కొంది. అప్పు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. దీంతో కేంద్రంతోపాటు అప్పులిచ్చిన ఎనిమిది బ్యాంకులు కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. కోర్టు బ్యాంకులకు నోటీసులు ఇవ్వకుండా కేంద్రానికి ఇచ్చింది. దీంతో రాష్ర్ట పరిస్థితి దారుణంగా మారింది.
రాష్ర్ట అభివృద్ధి కార్పొరేషన్ పేరిట అప్పులు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణ ప్రకారం వ్యతిరేకమని తెలిసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడంతో చిక్కుల్లో పడింది. తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సిందే. దీంతో ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చి పడింది.
తీసుకున్న రుణం ఖర్చు కావడంతో తిరిగి ఇవ్వడం కష్టమే. ఏపీఎస్డీసీ రుణం ప్రభుత్వానికి తీర్చుకోలేని విధంగా మారింది. దీంతో కేంద్రం కరుణిస్తేనే తప్ప రాష్ర్టం బతుకు బట్టకట్టే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రుణం తీర్చడానికి చర్యలు చేపట్టాల్సిందేనని తెలుస్తోంది.