Homeఎంటర్టైన్మెంట్Love story: లవ్​స్టోరీ 'విన్నర్​ బ్రో' వీడియో రిలీజ్​.. నెట్టింట్లో సందడి

Love story: లవ్​స్టోరీ ‘విన్నర్​ బ్రో’ వీడియో రిలీజ్​.. నెట్టింట్లో సందడి

Love story: నాగచైతన్య హీరోగా శేకర్​ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్​ స్టోరీ. ఇటీవలే వడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది.  సమాజంలోని కుల వివక్షతను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఇది. సాయిపల్లవి హీరోయిన్​. జుంబా ట్రైనర్‌, మధ్యతరగతి కుర్రాడిగా నాగచైతన్య,  జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనే అమ్మాయిగా సాయిపల్లవిల నటన ఎంతగానో అకట్టుకున్నాయి.  ఇక సాయిపల్లవి ఈ సినిమాలో చేసిన డ్యాన్స్‌పై సినీ ప్రియులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు కురిపించారు. కాగా, అక్టోబరు22న ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘విన్నర్‌ బ్రో’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను  సోషల్‌మీడియా వేదికగా రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇందులో సాయిపల్లవి, నాగచైతన్యల డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై నారాయణ దాస్‌ నిర్మించారు. పవన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ చైతన్య.. థ్యాంక్యూ సినిమాతో రానున్నారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన వెంటనే చైతూ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా కోసం రంగంలోకి దిగనున్నాడని సమాచారం.  ఈ సినిమాలో చైతూ లుక్‌, కనిపించే విధానం కొత్తగా ఉండనున్నాయట. ఇందుకోసం అతడు తన మేకోవర్‌ని పూర్తిగా మార్చుకోనున్నాడని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా చైతూ కసరత్తులు ప్రారంభించాడట.

ఈ సినిమా కోసం చైతన్య 15రోజులు చిత్రీకరణలో పాల్గొననున్నాడని తెలుస్తోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular