https://oktelugu.com/

జగ్గారెడ్డి సంచలనం.. త్వరలో పాదయాత్ర..!

తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఓ కొలిక్కి రాక ముందే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన తదుపరి కార్యచరణను ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని జగ్గారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు వెల్లడించినట్లు సమాచారం. Also Read: టీపీసీసీపై లీకులు.. కుట్ర కోణం ఉందంటున్న సీనియర్లు..! తన పాదయాత్ర తొలుత సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర […]

Written By: , Updated On : December 12, 2020 / 04:24 PM IST
Follow us on

Jagga Reddy

తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఓ కొలిక్కి రాక ముందే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన తదుపరి కార్యచరణను ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని జగ్గారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు వెల్లడించినట్లు సమాచారం.

Also Read: టీపీసీసీపై లీకులు.. కుట్ర కోణం ఉందంటున్న సీనియర్లు..!

తన పాదయాత్ర తొలుత సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి ఈసారి రైతులు సన్న ధాన్యం పండించారని ప్రస్తుతం వారిని పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.

పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ తరుఫున తాను రైతుల పక్షాన పోరాడుతానని ఠాకూర్ కు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ రైతును కలుసుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణ రూపొందించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Also Read: కేసీఆర్ కారు.. బోరు? రిపేరు?

ఈమేరకు త్వరలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ ను ప్రకటించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. టీపీసీసీ పదవీపై ఆశలు పెట్టుకున్న జగ్గారెడ్డి ఆ చర్చలు కొలిక్కి రాక ముందే పాదయాత్ర చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్