మక్కికిమక్కి దించుతానంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ‘వకీల్ సాబ్’ మూవీ పూర్తికాకుండా వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కల్యాణ్ కమిట్ అయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ లో నటించేందుకు పవన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. Also Read: మహేష్ ‘సర్కారీ వారి పాట’ అప్పుడే మొదలుకానుందా? మల్టిస్టారర్ మూవీగా ‘అయ్యప్పనుం కోషీయుం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒరిజినల్ […]

Written By: NARESH, Updated On : October 28, 2020 12:40 am
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ‘వకీల్ సాబ్’ మూవీ పూర్తికాకుండా వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కల్యాణ్ కమిట్ అయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ లో నటించేందుకు పవన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read: మహేష్ ‘సర్కారీ వారి పాట’ అప్పుడే మొదలుకానుందా?

మల్టిస్టారర్ మూవీగా ‘అయ్యప్పనుం కోషీయుం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒరిజినల్ కథలో బీజు మీనన్ చేసిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే పవన్ కల్యాణ్ నటించనున్నాడు. ఇద్దరు ఇగోయిష్టుల మధ్య సాగే పోరును కొంచెం క్లాస్‌గా మలయాళంలో తెరకెక్కింది. అయితే ఇదే కథను తెలుగులో మక్కిమక్కికి దించితే మనవాళ్లకు నచ్చుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

దగ్గుపాటి రానా సైతం పవన్ కల్యాణ్ నటించేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ పాత్రకు ధీటుగా రానా పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అయితే పవన్ మార్క్ మ్యానరిజం ఉంటేనే ఈ మూవీ అభిమానులు ఆకట్టుందని.. అలాకాకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కిస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ మరింత ఆలస్యం.. జక్కన్న ప్లాన్ ఏంటీ?

‘అయ్యప్పనుం కోషీయుం’ మూవీని తెలుగులో సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో సాగర్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీలోని నటునటులు.. సాంకేతిక సిబ్బందిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం.