Jagan: జగన్ సర్కార్ సిన్సియర్ ప్రయత్నం

విశాఖను పాలన రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై న్యాయ చిక్కులు ఉన్నాయి. ఇప్పట్లో తేలే అంశం గా కనిపించడం లేదు.

Written By: Neelambaram, Updated On : January 1, 2024 11:39 am
Follow us on

Jagan: విశాఖకు కార్యాలయాల తరలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. అమరావతి లోని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారు అంటూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపారు. ఈ నేపథ్యంలో తదుపరి తీర్పు వచ్చేవరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే విశాఖకు ఎలాగైనా కార్యాలయాలను తరలించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం నాలుగు రోజుల కిందట లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆదేశాలను సవాల్ చేస్తూ ఏజీ శ్రీరామ్ పిటిషన్ దాఖలు చేశారు. తాము దాఖలు చేసుకున్న రిట్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. విశాఖలో జరగాల్సిన అత్యవసర రివ్యూలు, ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయని ఏజీ తన వాదనలు వినిపించారు. నాలుగు రోజుల కిందటే ఈ విచారణ జరగగా.. రేపటికి వాయిదా పడింది. రేపు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశాఖను పాలన రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై న్యాయ చిక్కులు ఉన్నాయి. ఇప్పట్లో తేలే అంశం గా కనిపించడం లేదు. దీంతో కార్యాలయాలను తరలించి విశాఖ రాజధానికి తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపించేందుకు జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ కూడా న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. వీలైనంతవరకూ వీటిని అధిగమించి విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని జగన్ బలంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే హైకోర్టులో వరుసుగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు వరకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే విశాఖలో అడుగు పెట్టాలన్నది జగన్ లక్ష్యం. మరి ఏం జరుగుతుందో? ఎంతవరకు ఈ విషయం వెళ్తుందో? చూడాలి.