https://oktelugu.com/

Biryanai Contest: బిర్యానీ తిన్నాడు.. రూ.7 లక్షలు గెలిచాడు.. కొత్త ఏడాదితోపాటే కలిసి వచ్చిన అదృష్టం!

ఘుమఘుమలాడే బిర్యానీని ఇష్టపడని వారుండరు. పుట్టిన రోజు, పెళ్లి వేడుకలు, పండుగలు, ఇతర వేడుకల్లోనూ బిర్యానీ వడ్డిస్తున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2024 11:51 am
    Biryanai-Contest
    Follow us on

    Biryanai Contest:  ఆదివారం, ఇంటికి బంధువులు వచ్చినా.. బిర్యానీ ఇప్పుడు కామన్‌ రెసిపీగా మారింది. ఇక పార్టీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బిర్యానీ ఉండాల్సిందే. ఇక థర్టీఫస్ట్‌ పార్టీ అంటే వెరీ వెరీ స్పెషల్‌ కదా.. పాత ఏడాదికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలికేవేళ చలా మంది బిర్యానీలు లాగించేశారు. అయితే.. ఓ వ్యక్తి బిర్యానీ తిని అదృష్టాన్ని వెంట తెచ్చుకున్నాడు. బిర్యానీ తిన్న హోటల్‌ అందించిన ఖరీదైన గిఫ్ట్‌ గెలుచుకున్నాడు.

    తిరుపతి వాసి..
    ఘుమఘుమలాడే బిర్యానీని ఇష్టపడని వారుండరు. పుట్టిన రోజు, పెళ్లి వేడుకలు, పండుగలు, ఇతర వేడుకల్లోనూ బిర్యానీ వడ్డిస్తున్నారు. ఇక వేడుకల వేళ పలు హోటళ్లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. తిరుపతిలోని రోబో హోటల్‌ యాజమాన్యం గత సెప్టెంబర్‌లో వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. హోటల్‌లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికీ లక్కీ డ్రా కూపన్‌ అందజేసింది. దీంతో హోటల్‌కి వచ్చిన వారందరికీ కూపన్లు అందజేయడంతో సుమారు రూ.23 వేలకు పైగా కూపన్లు చేరాయి.

    కొత్త సంవత్సరం సందర్భంగా..
    జనవరి 1 నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి హోటల్‌ అధినేత భరత్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య నీలిమ హోటల్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించాడు. ఇందులో తిరుపతికి చెందిన రాహుల్‌ విజేతగా నిలిచారు. ఆయనకు దాదాపు 7 లక్షల రూపాయల విలువైన నిస్సాన్‌ మ్యాగ్నెట్‌ కారును ఉచితంగా అందజేశారు. ఈ విషయాన్ని హోటల్‌ అధినేతలు స్వయంగా రాహుల్‌కు ఫోన్‌∙చేసి శుభాకాంక్షలు తెలిపారు.

    కానుకగా కారు..
    అనంతరం రాహుల్‌ను పిలిపించారు. ఆయనకు కారును అందజేశారు. ఈ కార్యక్రమంలో రోబో హోటల్‌ అధినేత భరత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగర వాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న స్కీం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు రోబో హోటల్లో అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వినూత్న స్కీములు భవిష్యత్తులో మరిన్ని కొనసాగిస్తామన్నారు.