Homeఅంతర్జాతీయంAP Food Prices Increased: ఏపీలో ఇక టిఫిన్ చేయలేం.. స్వీట్లు కొనలేం.. కారణమిదీ!

AP Food Prices Increased: ఏపీలో ఇక టిఫిన్ చేయలేం.. స్వీట్లు కొనలేం.. కారణమిదీ!

AP Food Prices Increased: పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ‌టం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అస‌లే క‌రోనా ప‌రిస్థితుల్లో పెరిగిన ధ‌ర‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న జ‌నాల‌కు.. ఇప్పుడు ర‌ష్యా, యుక్రెయిన్ యుద్ధం పెద్ద షాకే ఇస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా దేశవ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. అలాగే గ్యాస్ ధ‌ర‌లు కూడా పెరిగాయి. దీంతో ఆటోమేటిక్ గా వాటి మీద ఆధార‌ప‌డిచేసే వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి.

AP Food Prices Increased
AP Food Prices Increased

కాగా ఇప్పుడు ఏపీలో టిఫిన్ల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. టిఫిన్లు మాత్ర‌మే కాకుండా.. స్వీట్ల ప‌రిస్థితి కూడా పెనంలో నుంచి తీసిన‌ట్టే ఉంది. ఎందుకంటే గ్యాస్ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డ‌మే. ర‌ష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్ర‌భావం ఏపీలోని హోట‌ళ్లు, రెస్టారెంట్ల మీద ప‌డింద‌న్న‌మాట‌. గ్రామాల నుంచి మొద‌ట‌లు పెడితే సిటీల దాకా అంత‌టా ఇవే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

Also Read: Venkaiah Naidu Suresh Gopi: పార్లమెంట్ లో సురేష్ గోపీ గడ్డంపై వెంకయ్యనాయుడు సెటైర్ కు నవ్వులే నవ్వులు

చాలా ప్రాంతాల్లో డ‌బుల్ రేట్లు పెర‌గ‌డంతో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు వాటిని కొన‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల్లో ప్లేట్ మీద రూ.5 నుంచి రూ.10 దాకా పెంచారు నిర్వాహ‌కులు. ఇంకా కొన్ని చోట్ల అయితే ధ‌ర‌లు పెంచితే బిజినెస్ న‌డ‌వ‌దేమో అని పూరీ, బజ్జీ లాంటి టిఫిన్లను అమ్మ‌డం ఆపేశారు. ఎందుకంటే వాటికి నూనె ఎక్కువ కావాలి, పైగా గ్యాస్ మీద ఎక్కువ సేపు ఉంచాల్సి వ‌స్తుంది.

ఇక రెస్టారెంట్ల‌లో కూడా ఫ్రైడ్ ఐటమ్స్ రేట్లను పెంచారు. ఇక అటు నూనెతో ఎక్కువ వేయించే స్వీట్ల రేట్ల‌ను కూడా అమాంతం పెంచేశారు. కొన్ని స్వీట్లకు అయితే కిలోకు రూ.20 నుండి రూ.50 దాకా పెంచేశారు. ఇక ఎండాకాలంలో ఎక్కువ‌గా అమ్ముడు పోయే ఆవ‌కాయల ధ‌ర‌లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వంట నూనె, గ్యాస్ తో అవ‌స‌ర‌ముండే వాటి ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో సామాన్య జ‌నం అల్లాడిపోతున్నారు. ఇలా అయితే.. వేటినీ కొన‌లేమ‌ని, చివ‌ర‌కు శ్రీలంక‌లో ఉన్న ప‌రిస్థితులే వ‌స్తాయేమో అని భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: AP Secretariat: స‌చివాల‌యానికి వ‌స్తున్న అప్పులోళ్లు.. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు గాయ‌బ్‌..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version