AP Food Prices Increased: పెనం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అసలే కరోనా పరిస్థితుల్లో పెరిగిన ధరలతో కొట్టుమిట్టాడుతున్న జనాలకు.. ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం పెద్ద షాకే ఇస్తోంది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. దీంతో ఆటోమేటిక్ గా వాటి మీద ఆధారపడిచేసే వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.
కాగా ఇప్పుడు ఏపీలో టిఫిన్ల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. టిఫిన్లు మాత్రమే కాకుండా.. స్వీట్ల పరిస్థితి కూడా పెనంలో నుంచి తీసినట్టే ఉంది. ఎందుకంటే గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడమే. రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ఏపీలోని హోటళ్లు, రెస్టారెంట్ల మీద పడిందన్నమాట. గ్రామాల నుంచి మొదటలు పెడితే సిటీల దాకా అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో డబుల్ రేట్లు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో ప్లేట్ మీద రూ.5 నుంచి రూ.10 దాకా పెంచారు నిర్వాహకులు. ఇంకా కొన్ని చోట్ల అయితే ధరలు పెంచితే బిజినెస్ నడవదేమో అని పూరీ, బజ్జీ లాంటి టిఫిన్లను అమ్మడం ఆపేశారు. ఎందుకంటే వాటికి నూనె ఎక్కువ కావాలి, పైగా గ్యాస్ మీద ఎక్కువ సేపు ఉంచాల్సి వస్తుంది.
ఇక రెస్టారెంట్లలో కూడా ఫ్రైడ్ ఐటమ్స్ రేట్లను పెంచారు. ఇక అటు నూనెతో ఎక్కువ వేయించే స్వీట్ల రేట్లను కూడా అమాంతం పెంచేశారు. కొన్ని స్వీట్లకు అయితే కిలోకు రూ.20 నుండి రూ.50 దాకా పెంచేశారు. ఇక ఎండాకాలంలో ఎక్కువగా అమ్ముడు పోయే ఆవకాయల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వంట నూనె, గ్యాస్ తో అవసరముండే వాటి ధరలు అమాంతం పెరగడంతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. ఇలా అయితే.. వేటినీ కొనలేమని, చివరకు శ్రీలంకలో ఉన్న పరిస్థితులే వస్తాయేమో అని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: AP Secretariat: సచివాలయానికి వస్తున్న అప్పులోళ్లు.. జగన్ సర్కార్ పరువు గాయబ్..!