Andhra Pradesh MP Vs SP: ఈమధ్య వైసీపీ నాయకులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. భారీ పై వస్తున్న ఆరోపణలు, పెడుతున్న కేసులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా భూకబ్జా ఆరోపణలు ఈ మధ్య వైసీపీ అధికార ప్రతినిధులపై చాలా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏకంగా ఎస్పి కి చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పని చేస్తున్న మధు తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఎంపీపై సీపీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ విషయం ఇప్పుడు అధికార వైసీపీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. పీఎం పాలెం గాయత్రి నగర్ లో వెంచర్ స్టార్ట్ చేసిన సత్యనారాయణ.. అందులోకి వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు. రోడ్డు వేసే క్రమంలో ఓ ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకుని మరీ కల్వర్టును నిర్మించారు. ఆ స్థలం ఎవరిదో కాదు ఎస్పీ మధు కుటుంబ సభ్యులది. దీంతో వారు మొదట్లో మర్యాదపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ వినకపోవడంతో తప్పక సీపీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఎస్పీ మధు చెబుతున్నారు.
Also Read: Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !
గతంలో కూడా ఎంపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. అసలే వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ అధికార ప్రతినిధులు మాత్రం ఇలాంటి కబ్జాలు మానట్లేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ఓ ఎస్పీ స్థలాన్ని కబ్జా చేశారంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎంపీ అయితే మాత్రం ఇలా కబ్జాలు చేసుకుంటూ పోవడం అంటూ అటు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరి ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు. పోనీ ఎస్పీ ఫిర్యాదు ఫేక్ అనుకుంటే.. ఇప్పటికే వైసీపీ ప్రతినిధులంతా రంగంలోకి దిగి నానా రాద్ధాంతం చేసేవారు. కానీ అలా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అంటే ఇది వాస్తవం అనే కదా. తమది ప్రజల పక్షం, పేదల పక్షం అని చెప్పుకునే వైసీపీ నేతలు.. ఇలాంటి కబ్జా వ్యవహారాలపై ఎందుకు స్పందించరు.
తప్పు చేయనప్పుడు భయమెందుకు. అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి ఉదారత చూపిస్తున్నా.. లోపల మాత్రం చేసేటివి ఇలాంటి పనులే అన్నమాట. గతంలో కొడాలి నానిపైన ఎన్ని ఆరోపణలు వచ్చాయో చూశాం. కానీ అప్పుడు ఎలాంటి స్పందన చేయని జగన్.. ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఏకంగా ఓ ఎఎస్పీ చేసిన ఫిర్యాదుపై ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.
Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?