ఉద్యోగాల కల్పనలో ఏపీ ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ గురించి చర్చ జరుగుతోంది. నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో ముఖ్యంగా బీపీవో ఉద్యోగాల ఏపీ ప్రభుత్వం దేశంలో అందరికన్నా ముందు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ద ఇండియా బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ప్రమోషన్ స్కీమ్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ కేటగిరిలో బీపీవో ఉద్యోగాలను సృష్టించడాన్ని ప్రోత్సహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఈ స్కీమ్ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ పథకం […]

Written By: Srinivas, Updated On : June 20, 2021 7:40 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ గురించి చర్చ జరుగుతోంది. నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో ముఖ్యంగా బీపీవో ఉద్యోగాల ఏపీ ప్రభుత్వం దేశంలో అందరికన్నా ముందు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ద ఇండియా బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ప్రమోషన్ స్కీమ్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

ఈ కేటగిరిలో బీపీవో ఉద్యోగాలను సృష్టించడాన్ని ప్రోత్సహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఈ స్కీమ్ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ పథకం కింద దేశంలోని రెండో, మూడో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ, బీపీవో కంపెనీలను విస్తరించి 12,234 ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ సృష్టించింది. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా దీన్ని ధృవీకరించింది.

రెండో స్థానం తమిళనాడుకు దక్కింది. ఏపీతో పోలిస్తే 9401 ఉద్యోగాలతో రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్, ఒడిశా, మహారాష్ర్ట తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగులు పొందుతున్న వారిలో అత్యధికులు మహిళలే ఉంటున్నారు. ఏపీ సర్కారు బీపీవో రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.

బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పిస్తారు. అందుకే వీటిని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల విప్లవం ప్రకటనల్లో పొందుపరచలేదు అందులో చెప్పిన ఆరున్నర లక్షల ఉద్యోగాలు పక్కాగా ప్రభుత్వ ఉద్యోగాలు బీపీవో ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు అంటే ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు రంగంలోనూ ఏపీలో ఉద్యోగాల విప్లవం వచ్చిందన్నమాట.