కృష్ణ నీటి కోసం ఏపీ ఫైట్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తూనే ఉంది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య  జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. జలవివాదాన్ని పరిష్కరించకుండా ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే […]

Written By: NARESH, Updated On : September 5, 2020 4:58 pm

Krishnawater

Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తూనే ఉంది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య  జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. జలవివాదాన్ని పరిష్కరించకుండా ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతోంది.

Also Read: ‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే ఇరురాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయనేది వాస్తవం. ఈ సమయంలో కృష్ణా జలాల వివాదం ఇరురాష్ట్రాల సీఎంల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం శోచనీయంగా మారింది.

కృష్ణా నదీ జల వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమసిపోవడం లేదు. శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలుపుతోంది. ఇప్పటికీ కృష్ణా జలాల వాటాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.

Also Read: చంద్రబాబు, పీవీ.. ఒక మరుపు కథ.!

ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా నది జలాల్లో వాటాపై ఏపీ గొంతెత్తింది. వాటాల ప్రకారం కృష్ణా జలాల్లో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ తాజాగా కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి 66 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది. ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలకు ఈ నీటిని ఇవ్వాలని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది.

గతంలో పోతిరెడ్డిపాడు నుంచి 9 టీఎంసీలు, హంద్రీనీవాకు 8 టీఎంసీలు బోర్డు కేటాయించింది. ఇప్పుడు వీటికి అదనంగా 71 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.  దీంతో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ మొదలైంది.