https://oktelugu.com/

యాక్షన్ కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా !

తమిళ్ స్టార్ హీరో సూర్య – యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ అనగానే.. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో పాటు ఫుల్ యాక్షన్ డ్రామా ఉంటుంది. పైగా గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అసలు సూర్య – హరి అంటేనే యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్. అంతలా పేరు ఉన్న వీరి కాంబినేషన్ అంటేనే.. కోలీవుడ్ లో మాస్ ప్రేక్షకులకు […]

Written By:
  • admin
  • , Updated On : September 5, 2020 / 04:35 PM IST
    Follow us on


    తమిళ్ స్టార్ హీరో సూర్య – యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ అనగానే.. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో పాటు ఫుల్ యాక్షన్ డ్రామా ఉంటుంది. పైగా గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అసలు సూర్య – హరి అంటేనే యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్. అంతలా పేరు ఉన్న వీరి కాంబినేషన్ అంటేనే.. కోలీవుడ్ లో మాస్ ప్రేక్షకులకు ఫుల్ క్రేజ్. ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తోంది. దాంతో సహజంగానే మాస్ ఆడియన్స్ కి భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి.

    Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?

    అయితే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోనట్లు ఈ సారి కూడా వీరిద్దరూ యాక్షన్ సినిమా చెయ్యట్లేదు. ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు చిత్రాలు చేసేశాం.. ఈ సారి ఏదైనా కొత్త తరహా కథను చూజ్ చేసుకుందామని సూర్య – హరి ఫీల్ అయినట్లు.. తమ కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా చేద్దామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదట పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహా కథలోనే ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేద్దామనే ప్లాన్ లో హరి ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడట. కానీ గ్రామీణ నేపథ్యంలో ఓ కొత్త రైటర్ చెప్పిన కథ నచ్చి.. ఆ కథనే చేద్దామని ఈ యాక్షన్ కాంబినేషన్ ఫిక్స్ అయింది.

    Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

    కానీ, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి సూర్య ప్రతి సినిమాలో ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకే సూర్య ఖాతాలో ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి డిఫరెంట్ చిత్రాలు ఉన్నాయి. ఏమైనా సూర్య – హరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న క్రమంలో ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ నుండి ఓ కొత్తరకం కథ రావాలని సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.