https://oktelugu.com/

అన్న ఎన్టీఆర్ ను మరవని కేసీఆర్..

టాలీవుడ్‌ అగ్ర హీరో, ఏపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ ధన్యవాదాలు చెప్పారు. అదేంటి.. బాలకృష్ణ కేసీఆర్‌‌కు ధన్యవాదాలు చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా..! అసలు తెలుగుదేశం అన్నా.. ఆ పార్టీ నాయకుడన్నా ఇష్టపడని కేసీఆర్‌‌కు బాలకృష్ణకు ఇదెక్కడి సాన్నిహిత్యం అని అనుకుంటున్నారా..? సాన్నిహిత్యం లేదు.. రాజకీయం లేదు.. తన తండ్రి ఎన్టీఆర్‌‌ జీవితాన్ని భవిష్యత్‌ తరాలకు తెలిపేలా పాఠ పుస్తకాల్లోకి ఎక్కించడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 04:08 PM IST
    Follow us on

    టాలీవుడ్‌ అగ్ర హీరో, ఏపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ ధన్యవాదాలు చెప్పారు. అదేంటి.. బాలకృష్ణ కేసీఆర్‌‌కు ధన్యవాదాలు చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా..! అసలు తెలుగుదేశం అన్నా.. ఆ పార్టీ నాయకుడన్నా ఇష్టపడని కేసీఆర్‌‌కు బాలకృష్ణకు ఇదెక్కడి సాన్నిహిత్యం అని అనుకుంటున్నారా..? సాన్నిహిత్యం లేదు.. రాజకీయం లేదు.. తన తండ్రి ఎన్టీఆర్‌‌ జీవితాన్ని భవిష్యత్‌ తరాలకు తెలిపేలా పాఠ పుస్తకాల్లోకి ఎక్కించడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ వేదికగా ఆయన స్పందించారు.

    Also Read: బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

    ‘కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు.

    Also Read: కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

    పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించడంపై నందమూరి ఫ్యామిలీలో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. పేదలకు రూ.2కే కిలో బియ్యం, మధ్యాహ్నం భోజన పథకం, మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్‌ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.

    నిజానికి కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆరే. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే కేసీఆర్ ఎదిగారు. అంతేకాదు.. తన కుమారుడికి గుర్తుగా తారక రామారావు పేరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు అంతులేని అభిమానం.. అందుకే ఆయన చరిత్రను తెలంగాణ భావి తరాలకు అందించాలని తెలంగాణ పాఠ్యాంశాల్లో కేసీఆర్ చేర్చారు. అన్న ఎన్టీఆర్ పై మమకారం చాటుకున్నారు.