PRC: ఏపీ సర్కార్ ‘పీఆర్సీ’ ఫైట్ కు మళ్లీ సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు

PRC:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన పీఆర్సీపై ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతోంది. తామొకటి తలిస్తే దైవమొకటి ఇచ్చిందన్నట్లుగా జగన్ ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట తప్పింది. దీంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరిపినా వారి డిమాండ్లు నెరవేరలేదు. దీంతో వారిలో నైరాశ్యం పెరుగుతోంది. అసుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. ఫలితంగా ఉద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ […]

Written By: Srinivas, Updated On : January 13, 2022 12:11 pm

CM Jagan

Follow us on

PRC:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన పీఆర్సీపై ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతోంది. తామొకటి తలిస్తే దైవమొకటి ఇచ్చిందన్నట్లుగా జగన్ ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట తప్పింది. దీంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరిపినా వారి డిమాండ్లు నెరవేరలేదు. దీంతో వారిలో నైరాశ్యం పెరుగుతోంది. అసుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. ఫలితంగా ఉద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది.

PRC:

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి వారిని ఆదుకుంది. ఏపీ మాత్రం ఫిట్ మెంట్ విషయంలో ఉద్యోగులకు మేలు చేయకపోగా కీడే చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 శాతం ఫిట్ మెంట్ అయినా ప్రకటిస్తుందని అనుకున్నా అది నెరవేరలేదు. దీంతో ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రధాన పాత్ర పోషించే ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే తెలుస్తోంది.

Also Read:  నాగార్జున డబుల్ రోల్.. రొమాన్స్ కూడా డబుల్ అంటేనే కష్టం !

పొరుగు రాష్ర్టం తెలంగాణ 30 శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులను సంతృప్తి పరచింది. పీఆర్సీ సిఫార్సు ేసినట్లుగా ఇంటి అద్దె భత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగించడమే కాకుండా అక్కడి నుంచి వచ్చిన ఉద్యోగులను ఆదుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగుల్లో సహజంగా ఆగ్రహం కలుగుతోంది. దీంతో ప్రభుత్వంపై పోరాడేందుకే సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఈనేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా నిరాశే మిగిల్చింది. దీంతో వారు అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలిగి తమ ఆగ్రహం ప్రదర్శించారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లు లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు కోపంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ మనుగడ ఉద్యోగులపైనే ఆధారపడిందని చెబుతున్నారు.

Also Read:  నాగార్జున డబుల్ రోల్.. రొమాన్స్ కూడా డబుల్ అంటేనే కష్టం !

Tags