Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభేదాలు పెరిగాయి. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చలో విజయవాడ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది సమావేశం అయితే ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు కూడా తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసమే వారిని నిలువరిస్తున్నారు.
అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కూడళ్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. అన్ని చోట్ల పోలీసులకు, ఉద్యోగులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా సభ నిర్వహించాలని ఉద్యోగులు చూస్తున్నారు. అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు ఉద్యోగులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు తమ పంతం నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు.
Also Read: ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు
అన్ని ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చుకునే క్రమంలో సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సమ్మె చేస్తే పనులు ముందుకు సాగవు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను చర్చలకు రావాలని ఆహ్వానించినా వారు తమ డిమాండ్లు నెవరేర్చితేనే వస్తామని చెప్పడంతో సమ్మె అనివార్యమయ్యే పరిస్థితులు వస్తున్నాయి.
Also Read: ఏపీలో కొత్త పథకాలు.. ఈ నెల నుంచే అమలు.. అర్హుల ఖాతాల్లో రూ.10 వేలు
ప్రభుత్వం కూడా ఉద్యోగుల మాటలు పట్టించుకోవడం లేదు. వారి డిమాండ్లు నెరవేర్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చలో విజయవాడ సభను విజయవంతం చేయాలని ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం కూడా వారి ప్రయత్నాలు భగ్నం చేసేందుకే నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్ నెగ్గుతుందా? ప్రభుత్వం పంతం నెరవేరుతుందా అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. దీనిపై ప్రభుత్వం, ఉద్యోగులు ఎందాక వెళతారో వేచి చూడాల్సిందే.