https://oktelugu.com/

Raashi Khanna: కోటి తీసుకుంటూ ఇంకా కక్కుర్తి ఎందుకు ‘రాశీ ఖన్నా’ ?

Raashi Khanna: నాలోని చిన్నపిల్ల బయటకు వచ్చింది అని హీరోయిన్ ‘రాశీ ఖన్నా’ తెగ ఇదై పోతుంది. అదేమిటి ? చిన్న పిల్ల బయటకు రావడం ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఈ వార్త పై బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం రష్యాలో ఉంది. ‘థ్యాంక్యూ ది’ మూవీ షూటింగ్ కోసం అక్కడకు వెళ్లింది. తాజాగా అక్కడి విశేషాలను ఇన్‌స్టాలో పంచుకుంది. ఏమి పంచుకుంది అంటే.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 3, 2022 / 01:09 PM IST
    Follow us on

    Raashi Khanna: నాలోని చిన్నపిల్ల బయటకు వచ్చింది అని హీరోయిన్ ‘రాశీ ఖన్నా’ తెగ ఇదై పోతుంది. అదేమిటి ? చిన్న పిల్ల బయటకు రావడం ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఈ వార్త పై బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం రష్యాలో ఉంది. ‘థ్యాంక్యూ ది’ మూవీ షూటింగ్ కోసం అక్కడకు వెళ్లింది. తాజాగా అక్కడి విశేషాలను ఇన్‌స్టాలో పంచుకుంది.

    Raashi Khanna

    ఏమి పంచుకుంది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘మాస్కోలో ఫుడ్ ఎంతో చీప్.. తక్కువ ధరే ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది సరైన స్థలం. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. నాలోని చిన్నపిల్ల బయటకు వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫుడ్ ఎంతో చీప్.. తక్కువ ధర అనగానే రాశీ ఖన్నా బాగా సంతోష పడిందట. మరి తక్కువ అంటే అంత సంతోషం ఎందుకో ? అయినా.. ఒక్కో సినిమాకు కోటి తీసుకుంటూ ఇంకా కక్కుర్తి ఎందుకు రాశీ అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

    Also Read: ‘పార్థు’గా మహేష్ బాబు.. ముహూర్తం ఘనంగా ముగిసింది !

     

    కాగా ఈ థ్యాంక్యూ మూవీలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. మీకు తెలుసా ? బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’ మొదట మనం సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పైగా ఆ సినిమాలో చైతుకి గర్ల్ ఫ్రెండ్ గా ఆమె కనిపించింది. మొత్తానికి ఏ హీరోతో అయితే.. సైడ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిందో.. అదే హీరోకి హీరోయిన్ గా నటిస్తోంది.

    ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అన్నట్టు.. రాశీ ఖన్నాకి పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుండి అందాలు ఆర‌బోయ‌డంలో హ‌ద్దులు దాటడంతో రాశీ ఖ‌న్నా మంచి ఎక్స్ పర్ట్.

    Also Read: సినిమాల్లోకి వెళ్ళు బావ.. అంతే, ఆమె మెడలో తాళి కట్టాడు !

    Tags