AP Electric Charges Hiked: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. దీంతో విమర్శలు వస్తున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ప్రజలపై ఎడాపెడా పన్నులు రుద్దేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలకు కంటి నిండ నిద్ర లేకుండా చేయడంలో భాగంగానే కరెంటు చార్జీల పెంపు అని పెదవివిరుస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసి ప్రస్తుతం కరెంటు చార్జీలు పెంచుతామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అందరిలో విమర్శలు వస్తున్నాయి. ప్రజలపై అదనపు భారం మోపేందుకు ప్రభుత్వం రెడీ కావడం దారుణం. ప్రజలు పన్నులు కట్టలేక సతమతమవుతుంటే మళ్లీ చార్జీ మోత అంటూ ప్రభుత్వం ప్రజలను బాధలకు గురిచేసేందుకు ప్రణాళికలు రచించడం సమంజసం కాదని చెబుతున్నారు.
Also Read: Jr.NTR : రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలతోనే నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా విద్యుత్ చార్జీలు పెంచుతామంటూ సర్కారు ప్రకటించడం దేనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. వైసీపీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడుతున్నారు. తక్షణమే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. కరెంటు చార్జీలు పెంచితే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సర్కారు ప్రజలపై భారం మోపే పనులు విరమించుకోవాల్సిందే.
ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నిర్ణయంపై తప్పుబట్టారు. ప్రజలపై భారం మోపే పనులు వద్దని హితవు చెప్పారు. ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సింది పోయి వారిపైనే భారం మోపే విద్యుత్ బిల్లుల పెంపు ప్రతిపాదన విరమించుకుని వారి ఆగ్రహానికి గురికావద్దని చెబుతున్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నిరంతరం ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Vijay Devarakonda: అతను కొడితే విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ !