Covid Sanctions: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కలవరపాటుకు గురి చేసింది. వ్యవస్థలన్నింటిని అతలాకుతలం చేసింది. ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. చిన్న వైరస్ అయినా పెద్ద ఉత్పాతమే సృష్టించింది. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. రెండేళ్లపాటు ప్రజలను నానా తంటాలు పడేలా చేసింది. చైనాలో పుట్టిన వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడింది. దాని దెబ్బకు అందరు కుదేలయ్యారు. మొదటి విడతలో వృద్ధులు, రెండో విడతలో యువత భారీ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా లక్షలాది ప్రాణాలు గాల్లో కలిశాయి.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, లాక్ డౌన్ తదితర ఆంక్షలతో మొత్తం జనాభా కరోనాకు బలైంది. నిత్యం కేసులు పెరుగుతూ ఆందోళనకర స్థాయిలో నరకయాతన చూపించింది. దీంతో కేసుల సంఖ్య పెరగడంతో భయాందోళన వ్యక్తమైంది. పెద్ద పెద్ద నగరాలైనా చిన్నచిన్న పట్టణాలైనా కరోనా ధాటికి భారీ మూల్యమే చెల్లించుకున్నాయి. ఫలితంగా రెండేళ్ల పాటు చదువులు అటకెక్కిపోయాయి. ప్రమోట్లతోనే పాస్ చేయించుకున్న దుస్థితి. కరోనా పేరు వింటే ఇప్పటికి అందరికీ బెదురే.
Also Read: AP Electric Charges Hiked: ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచితే ఖబడ్దార్.. వైసీపీకి పవన్ కల్యాణ్ హెచ్చరిక
అన్నింటికన్నా ఎక్కువ కేసులు మాత్రం మహారాష్ట్రలో వెలుగు చూడటం తెలిసిందే. ముంబై, నాగపూర్ లాంటి నగరాలు కరోనాకు కేంద్రాలుగా నిలిచాయి. ఫలితంగా కేసుల సంఖ్య అందరిలో దడపుట్టించింది. దీంతో ప్రపంచమే వణికిపోయింది. అమెరికా లాంటి అగ్రదేశం కూడా కరోనా ధాటికి తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. కానీ మనదేశం కరోనా టీకా కనుగొనడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉంటున్నాం. గుండెల మీద చేయి వేసుకుని మరీ తిరుగుతున్నాం. కరోనా రెండు డోసులు పడిన వారికి కరోనా వల్ల ముప్పు లేదనే విషయం తేలడంతో ఇప్పుడు స్వేచ్ఛ విహంగాల్లా మనగలుగుతున్నాం.

మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీంతో ఏప్రిల్ 2నుంచి కొవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై మాస్కులు ధరించడం అవసరం లేదు. భౌతిక దూరం పాటించకుండా తిరగొచ్చు. రెండు డోసులు వేసుకున్న వారు లోకల్ రైళ్లలో ప్రయాణించొచ్చు అని మహారాష్ట్ర సర్కారు ఆంక్షలను సులభతరం చేసింది. దీంతో మహారాష్ట్ర వాసుల్లో కొవిడ్ భయం పూర్తిగా కనుమరుగైనట్లు తెలుస్తోంది. కానీ ఇవాళ 183 కేసులు వెలుగు చూడగా 902 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి కరోనా దిగి రావడంతో ఇక మహారాష్ట్ర వాసులకు భయం తప్పింది.
Also Read: Jr.NTR : రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్