
AP Diamond Hunt: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని రాయలసీమ జిల్లాల్లో వజ్రాల వేట కొనసాగిస్తారు. అప్పుడప్పుడు దొరికిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో అందరు అదే పనిగా వెతుకుతుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల వ్యాపారంపై వ్యాపారులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో వజ్రాల లభ్యమవుతున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీంతో ఈ జిల్లా వాసుల కన్ను దీనిపై ఫోకస్ అయింది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో ఖనిజాన్వేషణ సాగిస్తోంది. ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇందులో మధ్యప్రదేశ్ 21 మైనింగ్ బ్లాక్ లున్నాయని నివేదించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేల్లు తొమ్మిది చొప్పున మైనింగ్ బ్లాక్ లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 14 స్టేట్లలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తాజాగా అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఏపీలో ఒక్క వైఎస్సార్ కడప జిల్లాలోనే ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చదరపు కిలోమీటర్లు, విశాఖ జిల్లా నందాలో 2.04 చదరపు కిలోమీటర్లు, బుద్ద రాయవలసలో 6.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాంగనీసు బ్లాకులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్కపల్లిలో 30.7 23 చదరపు కిలోమీటర్లు, అద్దంకి వార పాలెంలో 9.14 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఐరన్ ఓర్ బ్లాకులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా మాసాయిపేట పరిధిలో 20 చదరపు కిలోమీటర్ల మేర మెటల్ ఉన్నట్లు తెలుస్తోంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖనిజాన్వేషణ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో దాదాపు 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వజ్రాల గనులు ఉండడం గమనార్హం. ఇప్పటికే అక్రమ మైనింగ్ పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 100 మినరల్ బ్లాక్స్ ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా గుర్తించింది.
ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా మైనింగ్ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించడంతో వ్యాపారులు తమ చేతులకు పనిచెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిపోతోంది. వజ్రాల వేటలో ప్రజలు, వ్యాపారులు జోరందుకుంటున్నారు. దీంతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది.