ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంపీ రఘురామ కృష్ణం రాజు తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. డెయిరీ ఆస్తులను లీజుకు ఇవ్వాలనుకుంటే నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ డీడీబీ)కి ఇవ్వకుండా గుజరాత్ కు చెందిన అమూల్ కు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అమూల్ చేతికి ఏపీ డెయిరీ ఆస్తులను అప్పగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. రాష్ర్టంలోని డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు కేటాయించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులోో పిల్ వేశారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.
డెయిరీ ఆస్తులను అమూల్ కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత విచారణ చేపడతామని చెప్పిది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు కౌంటర్ దాఖలు చేస్తుందోనని చూస్తున్నారు. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ప్రభుత్వ సొమ్మును అమూల్ కు ఇవ్వకుండా చూడాల్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ సొమ్ము వెనక్కి రాబట్టేలా చేస్తామన్నారు. ముందు కౌంటర్ దాఖలుకు సమయం ఇద్దామని చెప్పింది. సొమ్మును తిరిగి రాబట్టడం సమస్య కాదని, డెయిరీ ఆస్తులను లీజు ప్రాతిపదికన అమూల్ కు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ఈలోపు కౌంటర్ దాఖలుకు ఆదేశిస్తామని పేర్కొంది. మే 4న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని దానికి అనుగుణంగా అమూల్ చేతికి ఆస్తులు అప్పగిస్తూ ఈ నెల 19న ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది.
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల తరువాత విచారణ చేపడితే పిల్ వ్యర్థం అవుతుంది. అమూల్ కు కేటాయించిన ఆస్తులను వెనక్కి తీసుకునేందుకు కేసు గెలిస్తే అవకాశం ఉంటుందన్నారు. అమూల్ వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. డెయిరీ ఆస్తుల బదలాయింపులపై స్టే ఇవ్వాలని భావిస్తే ఆ జీవోను సవాలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈమేరకు అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పింది. ఈనెల 27న జరిగే వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చేలా వయిదా వేయాలని పేర్కొన్నారు. అందుకు కోర్టు ఒప్పుకుంది.
రాష్ర్టంలో డెయిరీ డెవలప్ మెంట్ సంస్థ ఆస్తులను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.