
కృష్ణపట్నంలో కరనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ఈరోజు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేపట్టారు. మందుకోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ కష్టంగా మారింది. భౌతిక దూరం లేకుండా క్యూ లైవ్ లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మళ్లీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుంచి విశాలమైన గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని ఆదేశించారు.