https://oktelugu.com/

Ap Employees : ఉద్యోగుల డుమ్మా.. పిలిచినా రానంటారా?

ఐఏఎస్ అధికారులు సచివాలయానికి రాకపోతే పనులు ఎలా అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ అన్నారు. మీరే రోజు కార్యాలయానికి రాకుండా ఉంటే సిబ్బందిలో బద్దకం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయ నిర్వహణ బాగా లేదని, పరిసరాల పరిశుభ్రత కూడా సరిగా లేదని వాపోయారు. అయితే కొందరు విభాగాధిపతుల కార్యాలయాల నుంచి పని చేస్తున్నారని తెలిపారు. దీంతో సచివాలయంలో పలు విభాగాల్లో పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు కార్యాలయాలకు రాకుండా క్యాంపు […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 14, 2021 / 11:05 AM IST
    Follow us on

    ఐఏఎస్ అధికారులు సచివాలయానికి రాకపోతే పనులు ఎలా అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ అన్నారు. మీరే రోజు కార్యాలయానికి రాకుండా ఉంటే సిబ్బందిలో బద్దకం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయ నిర్వహణ బాగా లేదని, పరిసరాల పరిశుభ్రత కూడా సరిగా లేదని వాపోయారు. అయితే కొందరు విభాగాధిపతుల కార్యాలయాల నుంచి పని చేస్తున్నారని తెలిపారు. దీంతో సచివాలయంలో పలు విభాగాల్లో పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.

    ఉన్నతాధికారులు కార్యాలయాలకు రాకుండా క్యాంపు కార్యాలయాల నుంచి పనిచేయడం సరికాదని చెబుతున్నారు. దీంతో పరిపాలన గాడి తప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా తీవ్రత తగ్గినందున ఇకపై క్రమం తప్పకుండా కార్యాలయాలకు రావాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో నిలిపివేసిన బయోమెట్రిక్ విధానాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పుడైతేనే అందరు విధిగా కార్యాలయాలకు హాజరు అవుతారని చెప్పారు.

    గత ఏడాది మార్చిలో కొవిడ్ ఉధృతి పెరగడంతో చాలా మంది అధికారులు విజయవాడ, తాడేపల్లి వంటి చోట్ల ఉన్న విభాగాధిపతుల కార్యాలయాల నుంచి ఎక్కువ మంది విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో ఇటీవల థీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐఏఎస్ అధికారులే క్రమం తప్పకుండా కార్యాలయాలకు రాకపోతే కిందిస్థాయి సిబ్బంది ఎలా వస్తారని ప్రశ్నలు వస్తున్నాయి.

    అధికారుల తీరుపై కొందరు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కూడా వారిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కార్యాలయాలకు వెళ్లకపోవడంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరు ఇకపై విధిగా కార్యాలయాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఐఏఎస్ అధికారులు తమ ప్రవర్తన మార్చుకుని ప్రభుత్వానికి సహకరించేందుకు విధిగా సచివాలయానికి హాజరు కావాల్సిందిగా సూచిస్తున్నారు.