AP Corona Update: ఆంధ్రప్రదేశ్ మరోసారి కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణికుతోంది. కొద్దిరోజులుగా బీభత్సంగా కేసులు పెరుగుతున్నాయి. జనాలను భయపెడుతున్నాయి. ఒక్కరోజులో ఏకంగా 13వేల వరకూ కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మరోసారి దేశం లాక్ డౌన్ దిశగా సాగుతుందనుకుంటున్న వేళ ఏపీలోనూ అలాంటి పరిస్థితులు ఆందోళనకు కారణం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా ధాటికి విలవిలలాడుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో థర్డ్ వేవ్ ఖాయమని.. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా 24 గంటల వ్యవధిలో 43763 శాంపిల్స్ ను పరీక్షించగా.. 12926 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,66,194కు చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఇద్దరు,తూర్పుగోదావరిలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14538కు చేరింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 73143 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఏపీలోని రెండు జిల్లాలు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. వాటిల్లో ఏకంగా రోజుకు ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1959 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత చిత్తూరులో కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఏకంగా 1566 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత అనంతరంపురంలో 1379 కేసులు, గుంటూరులో 1212 కేసులు నమోదయ్యాయి. భారీ కేసులు వరుసగా నమోదు కావడంతో ఆయా జిల్లాలో ఆంక్షలు పెట్టే దిశగా అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. థర్డ్ వేవ్ వచ్చినట్టేనని లాక్ డౌన్ తప్పదా? అన్న ఆందోళనలు నెలకొన్నాయి.
#COVIDUpdates: 22/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,63,299 పాజిటివ్ కేసు లకు గాను
*20,75,618 మంది డిశ్చార్జ్ కాగా
*14,538 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 73,143#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/3qesO4YS22— ArogyaAndhra (@ArogyaAndhra) January 22, 2022