https://oktelugu.com/

ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షా రెడ్డి ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు సాధించారు. కూతురును డ్రాప్ చేయడం కోసం జగన్ దాదాపు ఐదు నెలల తరువాత రాష్ట్రం దాటి వెళుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగన్ బెంగళూరుకు వెళ్లి 26వ తేదీ కూడా అక్కడే ఉండి 27వ తేదీన తాడేపల్లికి రిటర్న్ అవుతారని తెలుస్తోంది. కూతురును పారిస్ కు పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళుతున్నాడని తెలుస్తోంది. రాష్ట్రంలో గత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 24, 2020 / 12:13 PM IST
    Follow us on

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షా రెడ్డి ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు సాధించారు. కూతురును డ్రాప్ చేయడం కోసం జగన్ దాదాపు ఐదు నెలల తరువాత రాష్ట్రం దాటి వెళుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగన్ బెంగళూరుకు వెళ్లి 26వ తేదీ కూడా అక్కడే ఉండి 27వ తేదీన తాడేపల్లికి రిటర్న్ అవుతారని తెలుస్తోంది. కూతురును పారిస్ కు పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళుతున్నాడని తెలుస్తోంది.

    రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల జగన్ పూర్తిస్థాయిలో ఏపీకే పరిమితమయ్యాడు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆ పని ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ ప్రస్తుతం ఏపీని దాటి వెళ్లాలనుకుంటున్నారు. ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలు ప్రపంచంలోని టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటి. హర్షారెడ్డి ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

    అనంతరం ఆమెకు అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ హర్షారెడ్డి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిన్న వయస్సు నుంచి హర్షారెడ్డి ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించడం గమనార్హం. సీఎం కూతురు సీటు సాధించడంతో వైసీపీలో సందడి నెలకొంది.