కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణం జగన్ ప్రభుత్వం ఊహించినంత తేలికైన వ్యవహారం కాదని స్పష్టం అవుతుంది. ఇప్పటికే చట్టపరంగా, న్యాయ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి తాజాగా సాంస్కృతిక ప్రదేశాల అంశానికి సంబంధించి మరో సమస్య ఎదురుకానుంది. ఈ అంశాన్ని ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. Also Read : ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…? కార్యనిర్వాహక రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ […]

Written By: Neelambaram, Updated On : August 24, 2020 1:30 pm

Is there no possibility of capital formation in Kapuluppada?

Follow us on

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణం జగన్ ప్రభుత్వం ఊహించినంత తేలికైన వ్యవహారం కాదని స్పష్టం అవుతుంది. ఇప్పటికే చట్టపరంగా, న్యాయ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి తాజాగా సాంస్కృతిక ప్రదేశాల అంశానికి సంబంధించి మరో సమస్య ఎదురుకానుంది. ఈ అంశాన్ని ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

Also Read : ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?

కార్యనిర్వాహక రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పడు కాకుండా శంకుస్థాపన పనులు పూర్తి చేసింది. అదునాతన హంగులతో భారీ స్టేట్ గెస్ట్ హౌస్ ను కాపులుప్పాడ గ్రేహౌండ్ కార్యాలయ సమీపంలో ఉన్న కొండపై నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఆటంకాలు ఎదుర్కొంటుంది. చారిత్రక ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టకూడాదని చట్టం చెబుతున్నా ఏపీ ప్రభుత్వం భౌద్ద కట్టడాలు ఉన్న ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టడంపై ఎంపి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాపులుప్పాడలో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రదేశంలో 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ద కట్టడాలు ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978 మే 2 న ఈ ప్రదేశాన్ని పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన తెలియజేశారు. పురావస్తు ప్రాంతంగా గుర్తంచిన ఈ ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హై కోర్టు సూచించిందన్నారు. ఈ అంశాలన్నింటీనీ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాలు జరగకుండా నిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిర్మాణం పనులు ప్రారభం అవకుండానే స్టేట్ గెస్ట్ హౌస్ కు అభ్యంతరాలు ప్రారంభం అవడతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకేన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణంపై తొలి నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన అమరావతిలోనే రాజధాని ఉంచాలని కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. 

Also Read : కాంగ్రెస్, టీడీపీ కథ కంచికేనా?