https://oktelugu.com/

మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నా.. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరట. సినిమాలో మెగాస్టార్ తో పాటు  నాజర్, జయసుధ లాంటి ఆర్టిస్ట్ లు కూడా అరవై సంవత్సరాలు పైబడిన వారే కావడంతో.. ఈ కరోనా పరిస్థితుల్లో షూటింగ్ చేయకపోవవడమే బెటర్ అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గాక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 / 11:33 AM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నా.. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరట. సినిమాలో మెగాస్టార్ తో పాటు  నాజర్, జయసుధ లాంటి ఆర్టిస్ట్ లు కూడా అరవై సంవత్సరాలు పైబడిన వారే కావడంతో.. ఈ కరోనా పరిస్థితుల్లో షూటింగ్ చేయకపోవవడమే బెటర్ అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి, కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలని.. అందుకు తగ్గట్లుగానే ఆర్టిస్ట్ లను కూడా సిద్ధంగా ఉంచాలని మెగాస్టార్ కొరటాలకు సూచించినట్లు తెలుస్తోంది.

    Also Read : బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

    ఇక మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమాపై  మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తాడని.. సినిమాలో చరణ్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపించబోతున్నారు.   కాకపోతే పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే చిరు అలా కనిపిస్తారని.. అలాగే ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని తెలుస్తోంది.

    ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు  మొదలు అయినా..  గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లోనే షూట్ చేస్తారట. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం  బరువు తగ్గడంతో పాటు లుక్ ను కూడా మార్చారు. అన్నట్టు  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది.

    Also Read : నాని ‘వి’ మూవీ సెన్సార్ రిపోర్ట్‌